తెలంగాణ

telangana

ETV Bharat / health

ఈ టిప్స్ పాటిస్తే - రోజంతా హ్యాపీగా! - how to fell happy

How to Increase Dopamine: ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? అదేంటి మేము ఆనందంగానే ఉన్నాముగా అనే డౌట్​ వచ్చిందా. అయితే ఒక్క నిమిషం.. హ్యాపీగా ఉండటం అంటే గంట, రెండు గంటలు కాదు.. జీవితాంతం. అయితే ఇది అయ్యే విషయం కాదనుకుంటున్నారా..? అయితే మీకా సందేహాం అక్కర్లేదు. లైఫ్​లాంగ్​ హ్యాపీగా ఉండటమనేది మన చేతుల్లోనే ఉందని అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

How to Increase Dopamine
How to Increase Dopamine

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 12:25 PM IST

How to Increase Dopamine to Become Happy:ఉన్నది ఒకటే జీవితం.. అందులో కష్టాలు, సుఖాలు, బాధలు, ఆనందం.. ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుత రోజుల్లో గంటసేపు ఆనందంగా ఉంటే.. అంతకు ఎక్కువగా బాధపడుతుంటారు. "ఏంటో నా జీవితం.. ఎప్పుడు సంతోషం అనేదే లేదు అని" ఆవేదన చెందుతారు. అయితే.. ఆనందంగా ఎక్కడో దొరకదని.. అది మనలోనే ఉందని అంటున్నారు నిపుణులు. మరి ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

మనలో చాలా మంది ఆనందం అంటే ఎక్కడి నుంచో వస్తుందని భావిస్తుంటారు. నిజానికి అది ఎక్కడా దొరకదు. స్పిరిచువల్​ గా చెప్పాలంటే.. ప్రతిదాంట్లో పాజిటివిటీ చూడడం ద్వారా.. మనసుకు నచ్చిన పనిచేయడం ద్వారా ఆనందం పొందొచ్చు. సైన్స్ పరంగా చూస్తే.. అది మెదడులో జరిగే రసాయన క్రియ అంటారు పరిశోధకులు. మనసులోని ఒత్తిడిని జయించి నిత్యం ఆనందంగా ఉండాలంటే బ్రెయిన్​లో హ్యాపీనెస్​కు సంబంధించిన రసాయన క్రియ ఎక్కువగా జరగాలని.. ఇందుకోసం కొన్ని పనులు చేయాలని సూచిస్తున్నారు.

డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్‌.. ఇవే మనల్ని సంతోషంగా ఉంచడానికి కారణమయ్యే రసాయనాలు. కొన్ని పనులు చేసినప్పుడల్లా, కొన్ని ఆహారాలు తీసుకున్నప్పుడల్లా.. మెదడులో ఈ కెమికల్స్ యాక్టివ్​ అవుతాయి. అప్పుడు మనిషి ఆనందంగా ఉంటాడని పరిశోధకులు చెబుతున్నారు. మరి.. ఆ పనులేంటి? ఆహారాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

వ్యాయామం :క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా.. ఎండార్ఫిన్, డోపమైన్, సెరోటోనిన్ స్థాయి పెరుగుతుందట. వర్కవుట్స్ మాత్రమే కాదు.. మీకు నచ్చిన డ్యాన్స్ కూడా చేయొచ్చు. ఇలా.. నచ్చిన విధంగా శరీరానికి పని కల్పించడం ద్వారా.. బ్రెయిన్​లో వీటి స్థాయి పెరుగుతుంది. ఫలితంగా మనసులోని ఒత్తిడి తగ్గిపోతుంది. అప్పుడు మనసులో రిలీఫ్, ముఖంలో ఆనందం తొణికిసలాడుతుంది.

తరచుగా నడుము నొప్పి వేధిస్తోందా? - ఈ వ్యాయామాలతో ఈజీగా చెక్ పెట్టొచ్చు!

స్మోకింగ్​ అండ్​ డ్రికింగ్​ :మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయితే ఈ అలవాట్లు కేవలం ఆరోగ్యానికి మాత్రమే హాని కాదు.. ఆనందాన్ని కూడా నాశనం చేస్తాయట. ఎందుకంటే.. ఈ అలవాట్లు మనిషిని క్షణికావేశానికి లోనయ్యేలా ప్రభావితం చేస్తాయట. కానీ.. ఆ తర్వాత దీర్ఘకాలంలో జీవితాన్ని నాశనం చేసే దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఆనందంగా ఉండాలంటే.. మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలు తీసుకోవడం, జూదం వంటివి మానేయాలని పరిశోధకులు చెబుతున్నారు.

ఫుడ్స్​:డార్క్ చాక్లెట్, అరటిపండ్లు, గ్రీన్ టీ, వాటర్ మిలన్ వంటి ఆహారాలు.. శరీరానికి అవసరమయ్యే డోపమైన్ రసాయనాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. కాబట్టి వీటిని రెగ్యులర్​ తీసుకునేందుకు ప్రయత్నించండి.

అలర్ట్ - మీ పిల్లలకు ఈ అలవాట్లు ఉన్నాయా?

మ్యూజిక్​:మ్యూజిక్​ వినడం వల్ల డోపమైన్‌ విడుదల అవుతుందని.. దీని వల్ల ఆనందంగా ఉంటామని చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎవరో చెప్పడం ఎందుకు..? మీరే తెలుసుకోవచ్చు. మీకు నచ్చిన పాట విన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది?

రోజువారి పనులు పూర్తి చేయడం:నిత్యం ఆనందంగా ఉండటంలో సాయపడే డోపమైన్ స్థాయిలను పెంచడానికి మరొక మార్గం రోజువారీ పనులను పూర్తి చేయడం. ఒక రోజులో చేయవలసిన అన్ని పనుల జాబితానూ ఓ లిస్ట్​గా ప్రిపేర్​ చేసుకుని.. ఒక ఆర్డర్​ ప్రకారం పూర్తి చేసి.. టిక్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ మెదడుకు రిలీఫ్​ లభిస్తుంది. అంతేకాకుండా మిగిలిన పనులు చేయడానికీ కొత్త ఉత్సాహం లభిస్తుంది.

కోపంతో గోడలను గుద్దుతూ, బ్లేడుతో చేతులు కట్ చేసుకుంటున్నారా?

క్రియేటివ్​ పనులు చేయడం:క్రియేటివ్​ పనులు సహజంగా డోపమైన్ స్థాయిలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే.. క్రియేటివిటీ కోసం మన మెదడుకు పని చెబుతాం.. దాని వల్ల బ్రెయిన్​ యాక్టివ్​గా ఉంటుంది.

మెడిటేషన్​:ధ్యానం కూడా డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. ఇది మిమ్మల్ని రిలాక్స్‌గా ఉంచడంతో పాటు.. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

చూశారుగా.. పైన చెప్పిన విధంగా ట్రై చేస్తే.. మీరు నిత్యం ఆనందంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అలర్ట్‌ : ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే స్ట్రెస్ పెరగడం ఖాయం!

ABOUT THE AUTHOR

...view details