Ayurvedic Home Remedy To Cure Throat Pain in Winter : శీతాకాలంలో చాలా మంది జలుబు, దగ్గుతో పాటు గొంతు నొప్పి కూడా బాధపడుతుంటారు. వాతావరణంలోని మార్పుల కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు గొంతులో తిష్ట వేసుకుంటాయి. ఫలితంగా గొంతంతా అసౌకర్యంగా అనిపిస్తుంది. దీని మూలంగా తినడం, తాగడం కష్టమవుతుంది. కొందరు లాలాజలాన్ని కూడా మింగలేకపోతారు. కొన్ని సార్లు నొప్పికి తోడు జ్వరం కూడా వస్తుంది. నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, గొంతు బొంగురు పోవడం, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభించేందుకు ఆయుర్వేద ప్రకారం ఓ ఔషధాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవీ. మరి దానిని ఎలా తయారు చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- లవంగాల చూర్ణం - 10 గ్రాములు
- తానికాయ పొడి - 10 గ్రాములు
- మిరియాల పొడి - 10 గ్రాములు
- కాచు - 30 గ్రాములు
- తుమ్మ బెరడు చూర్ణం - 30 గ్రాములు
- నీళ్లు - పావు లీటర్
తయారీ విధానం:
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పావు లీటర్ నీళ్లు పోయాలి. ఆ తర్వాత అందులోకి తుమ్మబెరడు చూర్ణం వేసి బాగా కలిపి సిమ్లో పెట్టి నీళ్లు పావు వంతు అయ్యేవరకు మరిగించుకోవాలి.
- ఈలోపు మరో గిన్నెలోకి కాచు పొడి, లవంగాల చూర్ణం, మిరియాల పొడి, తానికాయ చూర్ణం వేసి బాగా కలపాలి.
- నీళ్లు బాగా మరిగి ఇంకినప్పుడు ఈ పొడులన్నీ వేసి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
- గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దికొద్దిగా తీసుకుంటూ కుంకుడు గింజ పరిమాణంలో రౌండ్గా చేసుకోవాలి. ఇలా మిశ్రమం మొత్తాన్ని అలానే చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఓ డబ్బాలో స్టోర్ చేసుకుంటే గొంతు నొప్పికి ఔషధం రెడీ.
ఎలా తీసుకోవాలంటే:గొంతు నొప్పి సమస్య అధికంగా ఉన్నవారు ఈ మాత్రలను మూడు పూటలా అంటే ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఇంకోటి, రాత్రి మరోటి తీసుకుని నోట్లో వేసుకుని చప్పరించాలి. ఇలా గొంతు నొప్పి సమస్య తగ్గేవరకు తీసుకుంటూ ఉండాలని ప్రముఖ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు: