How To Control Rheumatoid Arthritis :అర్థరైటిస్ అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి. మోకాళ్లు, వెన్నెముక, చేతివేళ్లు మొదలైన కండరాలు, వాటి జాయింట్స్‌పై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు కూర్చోవడం, నడవడం వంటి చిన్నచిన్న పనులకు కూడా కష్టపడుతుంటారు. ఇది ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనిపించేది. కానీ, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల 30 వయసులో కూడా ఈ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. అయితే, రుమటాయిడ్ అర్ధరైటిస్ వ్యాధి నుంచి సహజ సిద్ధంగా ఉపశమనం ఎలా పొందాలో నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
రుమటాయిడ్ అర్ధరైటిస్ వ్యాధి బారిన ఒక్కసారి పడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. దీనికి పూర్తి చికిత్స ఇప్పటివరకూ అందుబాటులో లేదని అంటున్నారు. అయితే, ఈ కండరాల నొప్పులను తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ మీ కోసం..
తగినంత నిద్ర అవసరం..
ఈ కీళ్లవాతం వ్యాధితో బాధపడేవారు తగినంత నిద్రపోవడం వల్ల నొప్పులను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు నిద్రకు సమయం కేటాయించడం వల్ల కొంత వరకు ఉపశమనం పొందినట్లు వెల్లడించారు.
లెమన్‌గ్రాస్ నూనెతో..
రుమటాయిడ్ అర్ధరైటిస్ వ్యాధి వల్ల వచ్చే కండరాలు, జాయింట్ నొప్పులను తగ్గించడంలో లెమన్‌గ్రాస్ ఆయిల్ ప్రభావవంతంగా పనిచేసిందని జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది.