How to Clean Refrigerator :ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండటం కామన్ అయిపోయింది. బిజీబిజీ లైఫ్‌లో కూరగాయలు, పండ్లు, ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడానికి, అలాగే వాటిని ఫ్రెష్‌గా ఉంచుకోవడానికి ఫ్రిడ్జ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే.. ఫ్రిడ్జ్ వాడకం ఓ రేంజ్లో ఉన్నా.. దాని క్లీనింగ్ విషయంలో మాత్రం పట్టించుకోరు. కొద్దిమంది క్లీనింగ్ చేసినా పైపైనే చేస్తుంటారు. దీంతో చాలా ఇళ్లలోని ఫ్రిడ్జ్‌లు దుర్వాసన వెదజల్లుతుంటాయి. అయితే ఇలా బ్యాడ్ స్మెల్ రావడానికి ఫ్రిడ్జ్‌లోపల బ్యాక్టీరియా పేరుకుపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండటానికి క్లీనింగ్ టిప్స్ చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్రిడ్జ్‌ను క్లీన్ చేసే ముందు ఫ్రిజ్‌ని అన్ ప్లగ్ చేయండి. తర్వాత క్లీనింగ్ మొదలు పెట్టండి. ముందుగా ఫ్రిడ్జ్‌లోని అన్ని పదార్థాలను తీసి పక్కన పెట్టండి. ఆ తర్వాత అరలను (షెల్ఫ్‌లు) అన్నింటినీ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత షెల్ఫ్‌లను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. అనంతరం షెల్ఫ్‌లను పొడి బట్టతో తుడవండి. ఇలా చేస్తే షెల్ఫ్‌లపైన ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది.
నెలకోసారి వాషింగ్ మెషిన్‌ను ఇలా క్లీన్ చేయండి - మురికిపోయి కొత్త దానిలా మెరుస్తుంది!
బేకింగ్ సోడా :ఇప్పుడుఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లను తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్‌ల బేకింగ్ సోడాను కలుపుకోండి. తర్వాత ఈ నీళ్లలో ఒక పొడి వస్త్రాన్ని ముంచి.. దానితో ఫ్రిడ్జ్ లోపల, బయట బాగా క్లీన్ చేయాలి. తర్వాత ఒక పొడి బట్టతో ఫ్రిడ్జ్‌ను మొత్తం తుడవాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన మొత్తం పోతుందని నిపుణులు చెబుతున్నారు.