How to Check Thyroid Symptoms in Children: థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉండే ఒక చిన్న గ్రంథి. సీతాకోక చిలుక ఆకారంలో ఇది ఉంటుంది. శిశువుల్లో బ్రెయిన్ డెవలప్మెంట్, గ్రోత్‌కు సహాయపడే హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఇక పెద్దలలో అయితే మెటబాలిజమ్‌ను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే.. థైరాయిడ్ అనగానే అది పెద్దలకు వచ్చే సమస్య అనుకుంటారు. కానీ ఇది పిల్లల్లో కూడా వస్తుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హైపో థైరాయిడిజం, రెండోది హైపర్ థైరాయిడిజం. మరి పిల్లల్లో ఈ లక్షణాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.
హైపో థైరాయిడిజం:తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటే.. దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఇది జన్యుపరంగా కుటుంబంలో వస్తుంది. పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం అనేది నవజాత శిశువుల్లో గుర్తించే అత్యంత సాధారణ సమస్య. మహిళ కన్సీవ్ అయినప్పుడు థైరాయిడ్ సమస్య వస్తే.. అది బిడ్డకి కూడా సంక్రమిస్తుంది. అయితే ఏ వయస్సులో ఇది బయటపడుతుందనే చెప్పడం కొంచెం కష్టం.
లక్షణాలు:పిల్లల్లో హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. నీరసంగా ఉండడం, శక్తి తగ్గిపోవడం, మలబద్ధకం, చర్మం పొడిబారడం, చలిగా అనిపించడం, కండరాల నొప్పులు కనిపిస్తాయి.
థైరాయిడ్‌తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ టిప్స్‌తో అదుపులోకి రావడం పక్కా!
హైపర్ థైరాయిడిజం:థైరాయిడ్ గ్రంథులు అతిగా పని చేసి అవసరమైన దాని కంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపర్ థైరాయిడిజం అంటారు. అయితే ఇది పిల్లల్లో అరుదుగా కనిపిస్తుంది. అంటే సుమారు 10,000 మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే ఈ పరిస్థితి ఏర్పడుతుంది.