తెలంగాణ

telangana

ETV Bharat / health

మీకు కర్లీ హెయిర్ అంటే ఇష్టమా? - పార్లర్​కు వెళ్లకుండానే మీ జుట్టును మార్చేయండి! - Tips for Straight Hair to Curly

Straight Hair to Curly: అమ్మాయిల్లో కొందరికి సాఫ్ట్‌ జుట్టు కావాలి. ఇంకొందరికి స్ట్రెయిట్‌గా ఉండాలి.. మరికొందరికి మాత్రం కర్లీ హెయిర్ కావాలి. తమ నచ్చిన జుట్టు లేదని తెగ బాధపడుతుంటారు. ఇలాంటి వారికోసమే ఈ స్టోరీ. కర్లీ హెయిర్​ కావాలని కోరుకునే వారు.. పార్లర్​కు వెళ్లకుండానే ఈజీగా పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం!

Straight Hair to Curly
Straight Hair to Curly (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 4:59 PM IST

Tips to Change Straight Hair to Curly: అందంగా కనిపించడంలో ముఖ వర్చస్సు మాత్రమే కాదు.. జుట్టుదీ కీలకపాత్రే. అందుకే మహిళలు.. ఒత్తైన జుట్టు కోసం ఆరాటపడుతుంటారు. అయితే.. కొందరు తమకు ఉన్న జుట్టుకు బదులుగా వేరే రకం జుట్టు ఉంటే బాగుండు అనుకుంటారు. ఇలాంటి వారిలో కర్లీ హెయిర్​ కోరుకునేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. మీరు కూడా ఈ లిస్టులో ఉంటే.. మీ జుట్టునే కర్లీగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

హెయిర్​ కర్లీగా మార్చే​ ముందు పాటించాల్సిన టిప్స్​:

  • మార్కెట్​లో కర్ల్​ పెంచే షాంపూ, కండీషనర్లు లభిస్తాయని.. వాటి సాయంతో తలస్నానం చేసి జుట్టు ఆరనివ్వాలి.
  • ఈ ప్రొడక్ట్స్​ కర్ల్స్​ పర్ఫెక్ట్​గా రావడానికి హెల్ప్​ చేస్తాయి. జుట్టు ఒకవేళ తడిగా ఉంటే కర్ల్​ క్రీమ్​, జెల్​ వంటి అప్లై చేయమంటున్నారు.
  • తర్వాత దువ్వెన లేదా వేళ్ల సాయంతో చిక్కులు లేకుండా నీట్​గా దువ్వుకోవాలి.
  • అయితే.. జుట్టు చిక్కులు లేకుండా చేసే క్రమంలో జుట్టును గట్టిగా లాగడం చేయొద్దని, స్మూత్​గా చిక్కులు లేకుండా దువ్వుకోవాలని నిపుణులు అంటున్నారు.
  • ఇప్పుడు మీ జుట్టు పొడవు, మందం బట్టి జుట్టును చిన్న చిన్న భాగాలుగా సెపరేట్​ చేయాలి.
  • ఇలా చేయడం వల్ల పని ఈజీ అవుతుంది. అలాగే కర్ల్​ కూడా పర్ఫెక్ట్​గా వస్తుందని అంటున్నారు.

అలర్ట్‌ - రెగ్యులర్​గా జుట్టుకు రంగు వేస్తున్నారా ? ఈ సమస్యలు ఎటాక్​ చేయడం గ్యారెంటీ! - Side Effects of Hair Colouring

కర్ల్​ చేసే పద్ధతులు:పైన చెప్పిన టిప్స్​ ఫాలో అయిన తర్వాత ఇప్పుడు చెప్పే పద్ధతుల్లో ఏదైనా ఒక విధానంలో మీ స్ట్రెయిట్​ హెయిర్​ను కర్లీగా మార్చుకోవచ్చు. ఆ పద్ధతులు​ ఏంటంటే..

1. ఫింగర్​ కాయిలింగ్ (Finger Coiling):ముందుగా మీ జుట్టులో కొంత భాగాన్ని తీసుకుని దాని మీ వేలుకు రౌండ్​గా చుట్టుకోవాలి. పై నుంచి మొదలు పెట్టి కింది వరకు అలానే చుట్టుకోవాలి. ఇప్పుడు కర్ల్​ను అలానే ఉంచి జాగ్రత్తగా ఫింగర్​ను రిమూవ్​ చేయాలి. ఇలా జుట్టు మొత్తాన్ని ఇదే పద్ధతిలో చేసుకోవాలి. నిమిషాల్లోనే​ కర్లీ హెయిర్​ సెట్​ అవుతుంది.

2. ట్విస్ట్​ అవుట్(Twist Out)​:జుట్టులో కొంత భాగాన్ని తీసుకోవాలి. దానిని రెండు పార్ట్స్​గా డివైడ్​ చేసి ఒకదాని తర్వాత ఒక దాన్ని కలుపుకుంటూ గట్టిగా రౌండ్​గా తిప్పాలి. లాస్ట్​కు క్లిప్​ పెట్టి కొద్దిసేపు వదిలేయాలి. ఇలా జుట్టు మొత్తాన్ని అలానే చేసి.. కొద్దిసేపటి తర్వాత క్లిప్​ తీసి జుట్టును లూజ్​ చేసుకోవాలి. నిమిషాల్లోనే​ కర్లీ హెయిర్​ సెట్​ అవుతుంది.

3. బంటు నాట్స్(Bantu Knots)​:జుట్టులో కొంత భాగాన్ని తీసుకుని దానిని రౌండ్​గా గట్టిగా తిప్పి.. తలపైన ముడిగా చుట్టి దానిని క్లిప్​తో సెట్​ చేసుకోవాలి. ఇలా జుట్టు మొత్తం చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ముడి విప్పితే సరి. అందమైన కర్లీ హెయిర్​ రెడీ అవుతుంది.

పైన చెప్పిన పద్ధతుల్లో ఏదో ఒక దానిని ట్రై చేస్తే నిమిషాల్లోనే మీ స్ట్రెయిట్​ హెయిర్​ కర్లీగా మారుతుంది. జుట్టు కూడా అందంగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. అయితే.. హెయిర్ కర్లీ చేసుకున్న తర్వాత జుట్టును పదే పదే దువ్వడం, అనవసరంగా తాకడం లాంటివి చేయొద్దని నిపుణులు అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జుట్టు పెరగడంలేదని బాధపడుతున్నారా? ఈ నూనెలు ట్రై చేస్తే రెండింతలు పెరగడం పక్కా! - Best Oils for Double Hair Growth

కోడిగుడ్డును ఇలా అప్లై చేస్తే - జుట్టు సమస్యలన్నీ పరార్ - హెల్దీ హెయిర్ గ్యారెంటీ! - Egg Masks for Hair Growth

ABOUT THE AUTHOR

...view details