తెలంగాణ

telangana

ETV Bharat / health

కిలో బరువు తగ్గాలంటే ఎంత దూరం నడవాలి? ఎన్ని క్యాలరీలు కరిగించాలో తెలుసా?

How Much Walk To Lose One Kilo Weight : బరువు ఎక్కువగా ఉంటే చాలామందికి వాకింగ్​కు వెళ్లాలనే సూచనలు వినిపిస్తుంటాయి. వాకింగ్​ చెయ్యడం వల్ల శరీరం ఫిట్​గా ఉండటమే కాకుండా అధిక బరువు సమస్య నుంచి కూడా తప్పించుకోవచ్చు అనే భావన కూడా చాలామందిలో ఉంటుంది. అయితే వాకింగ్​ ద్వారా కిలో బరువు తగ్గాలంటే ఎన్ని కిలోమీటర్లు నడవాలనే విషయాలను ఎవరూ వివరించరు. ఈ నేపథ్యంలో ఒక కిలో బరువు తగ్గాలంటే ఎన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

How Much Walk To Lose 1 Kg Weight
How Much Walk To Lose 1 Kg Weight

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 7:01 AM IST

How Much Walk To Lose One Kilo Weight :అధిక బరువు, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. బరువు తగ్గడానికి అనేక చిట్కాలు ఉన్నా, చాలా మంది వాకింగ్​ చెయ్యడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక వాకింగ్​ చెయ్యడం వల్ల బరువు తగ్గుతారని చాలామంది సలహాలు ఇస్తుంటారు. అయితే ఒక కిలో బరువు తగ్గాలంటే ఎంత దూరం నడవాలి అనేది స్పష్టంగా తెలియక చాలామంది మదన పడుతుంటారు. అలాంటి వారు ఎన్ని కిలోమీటర్లు నడిస్తే కిలో బరువు తగ్గవచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • బరువు తగ్గడం అనేది మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. శరీరం ఎంత బరువు ఉంటుందనే దాని ఆధారంగా ఎన్ని కిలోమీటర్లు నడవాలనేది నిర్ణయిస్తారు.
  • శరీర బరువుతో పాటు నడక తీవ్రత అనేది కూడా బరువు తగ్గడం విషయంలో తీవ్ర ప్రభావం చూపే మరో అంశం. సాధారణంగా నడుస్తున్నారా లేదంటే శరీరానికి శ్రమ కలిగేలా నడుస్తున్నారా అనేది బరువు తగ్గడం మీద ప్రభావం చూపుతుంది.
  • ఇక మూడోది జీవక్రియ సామర్థ్యం. ఇది వివిధ వ్యక్తుల్లో మారుతూ ఉంటుంది. కిలో బరువు తగ్గడానికి ఒక్క వ్యక్తి సుమారుగా 7వేల క్యాలరీలను కరిగించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.

ఒక్క కిలో తగ్గేందుకు లెక్కవివి
సాధారణ వ్యక్తి కిలోమీటర్​ దూరం నడిస్తే 0.4క్యాలరీల నుంచి 0.5 క్యాలరీల వరకు ఖర్చు అవుతాయి. ఈ లెక్కన 70కిలోల బరువున్న వ్యక్తి కిలోమీటర్​ నడిస్తే 28 క్యాలరీల నుంచి 35 క్యాలరీల వరకు బర్న్​ చేయవచ్చు. ఒక కిలో శరీర కొవ్వు సుమారు 7వేల క్యాలరీలకు సమానం అయితే 70కిలోల బరువు ఉన్న వ్యక్తి తన కేజీ బరువు అంటే 7000 క్యాలరీలను కోల్పోవడానికి 200 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి తన ఆహారం, ఇతర అంశాల్లో ఎలాంటి మార్పులు చేసుకోకుండా నడవాల్సిన దూరం 200 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్లు అన్నమాట. ఇక అడుగుల్లో లెక్కిస్తే సుమారు 2,50,000 నుంచి 3,12,500 అడుగులు. దీన్ని గంటల్లో లెక్కిస్తే గంటకు 5 కిలోమీటర్లు నడిస్తే, ఆ లెక్కన 40 నుంచి 50 గంటలు నడిస్తే ఒక కిలో బరువు తగ్గవచ్చు.

అయితే అధిక బరువు కలిగిన వారు కిలో బరువు కోల్పోవడానికి సాధారణ వ్యక్తులతో పోలిస్తే తక్కువ దూరం నడవాల్సి ఉంటుంది. అలా కాకుండా బరువు తక్కువగా ఉన్న వాళ్లు కిలో బరువు తగ్గడానికి క్యాలరీలను ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది.

అయితే ఎంత వేగంగా నడుస్తారనేది కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు డాక్టర్లు. ఎత్తైన భూభాగంలో నడిస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీంతో దూరం తక్కువైనా ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. అలాగే నడక అలవాటు ఉన్న వారికి క్యాలరీలు తక్కువ ఖర్చు అయితే నడక అలవాటు లేని వారికి ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయని వైద్యులు చెబుతున్నారు.

బరువు తగ్గాలని అనుకుంటే ఇలా చెయ్యండి

  1. క్రమం తప్పకుండా వాకింగ్​ చేయండి.
  2. తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోండి.
  3. శారీరకంగా శ్రమపడటం అస్సలు మర్చిపోవద్దు.
  4. భోజనం తర్వాత నడవడం అలవాటు చేసుకోండి.
  5. శరీరానికి తగినంత నీటిని అందిస్తూ ఉండండి.
  6. ఎలివేటర్లు/ లిఫ్ట్​లను వీలైనంత వరకు ఉపయోగించకండి. మెట్ల మార్గాన్నే ఎంచుకోండి.

చెవిలో ఏమైనా ఇరుక్కుందా? ఫస్ట్​ అసలేం చేయాలో తెలుసా?

అల్లం త్వరగా పాడవుతుందా? - ఇలా స్టోర్ చేసుకుంటే చాలా కాలం ఫ్రెష్​గా ఉండడం పక్కా!

ABOUT THE AUTHOR

...view details