తెలంగాణ

telangana

ETV Bharat / health

గుండెపోటుకు నెల ముందే బాడీ వార్నింగ్ ఇస్తుందట! ఈ 6 లక్షణాలు గుర్తించాలంటున్న​ నిపుణులు! - heart attack warning signs - HEART ATTACK WARNING SIGNS

Heart Attack Warning Signs a Month Before : ప్రస్తుతం మారిన జీవనశైలితో చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మందే గుండెపోటుతో బాధపడుతున్నారు. అయితే, అనేక మంది దీనిని ఆకస్మిక మరణంగా భావిస్తారు. కానీ, నిజానికి గుండెపోటు రావడానికి 10 రోజుల ముందు నుంచే కొన్ని లక్షణాలు మనలో కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలను సరిగ్గా గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గుండెపోటుకు ముందు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం?

Heart Attack Warning Signs
Heart Attack Warning Signs (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Aug 30, 2024, 12:31 PM IST

Updated : Sep 14, 2024, 7:14 AM IST

Heart Attack Warning Signs a Month Before :మన శరీరంలోని అవయవాలలో గుండె అత్యంత ముఖ్యమైనది. ఇది ఆరోగ్యంగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాము. అయితే, ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసులోనే అనేక మందికి గుండెపోటు వస్తుంది. ఆస్పత్రికి తీసుకుని వెళ్లేలోపే చాలా మంది మరణిస్తున్నారు. అయితే, గుండెపోటు వచ్చే 10 రోజుల నుంచి నెల లోపు అనేక హెచ్చరికలు ఇస్తుందట. దానిని సరిగ్గా గమనిస్తే గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మరి.. గుండెపోటుకు ముందు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అలసటగా ఉంటుంది
గుండెపోటు వచ్చే 10 రోజుల నుంచి ఒక నెల ముందు వరకు అలసటగా ఉంటారని వైద్యులు చెప్పారు. ఈ లక్షణం పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని 2019లో నేషనల్​ హార్ట్, లంగ్​ అండ్ బ్లడ్​ ఇన్​స్టిట్యూట్​ జర్నల్​లో వెల్లడైంది. Fatigue as a Symptom of Acute Coronary Syndrome in Women(రిపోర్ట్​) అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో డాక్టర్​ లక్ష్మీ మెహతా, డాక్టర్ Vaccarino V పాల్గొన్నారు.

ఛాతీలో అసౌకర్యం
గుండెపోటు వచ్చే ముందు ఛాతీ చుట్టూ చాలా అసౌకర్యాన్ని అనుభవిస్తారని వైద్యులు చెప్పారు. దీంతో పాటు ఛాతీ బిగుతుగా, భారంగా అనిపిస్తుందని.. ఛాతీ మధ్యలో నొప్పిగా ఉంటుందని వివరించారు.

చెమటలు పట్టడం
చాలా మంది చెమటలు పడుతుంటే సాధారణమేనని భావిస్తుంటారు. అయితే, గుండెపోటు వచ్చేవారిలో ముందుగా విపరీతంగా చెమటలు పడతాయని వైద్యులు వెల్లడించారు. గుండెకు తగినంతగా రక్త సరఫరా జరగకపోవడం వల్ల రోగులకు విపరీతంగా చెమట పడుతుందని వివరించారు. దీంతోపాటు కొందరు అజీర్ణం లేదా వికారం వంటి సమస్యలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు.

గుండె వేగంగా కొట్టుకోవడం
గుండెకు సరిపడా రక్తం అందకపోతేనే అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెప్పారు. దీని వల్లే గుండె వేగం కూడా పెరుగుతుందని తెలిపారు. గుండెపోటుకు కొన్ని రోజుల ముందు నుంచే రోగులకు హృదయ స్పందన రేటు పెరుగుతుందని వివరించారు.

బాడీ పెయిన్స్
గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందు కనిపించే ప్రధాన లక్షణాలలో శరీర నొప్పులు ఒకటి. ఈ సమయంలో రోగి ఛాతీ, భుజాలు, చేతులు, వెనుక, మెడ దవడలో నొప్పిని ఉంటుందని చెప్పారు. నిజానికి గుండెకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ధమనులు మూసుకుపోతాయని.. ఇది నొప్పిని కలిగిస్తుందని తెలిపారు.

తరచుగా తలతిరగడం
కారణం లేకుండా తల తిరిగినట్లుగా అనిపిస్తే సాధారణంగా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ గుండెపోటుకు లక్షణాలు కావచ్చని చెబుతున్నారు. తల తిరగడం, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తక్కువ రక్తపోటు.. ఇవన్నీ గుండెపోటు లక్షణాలు కావచ్చని వివరించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జుట్టును పదేపదే దువ్వుతున్నారా? వెంట్రుకలు రాలిపోతాయట జాగ్రత్త! హెయిర్​ లాస్​కు ఆయుర్వేద చిట్కాలు - hair loss treatment in ayurveda

బత్తాయి తింటే నీరసం, అలసట ఉండవు- బాడీలో ఇమ్యూనిటీ ఫుల్​- క్రీడాకారులూ ఇవే తింటారట!! - Mosambi Benefits for Health

Last Updated : Sep 14, 2024, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details