Healthy Street Foods : వెదర్ మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు మారతాయి. ముఖ్యంగా చినుకులు పడుతున్నాయంటే నాలుకతో పాటు మనసు కూడా వేడి వేడిగా, కారం కారంగా ఏమైనా తిందామా అని ఆరాటపడుతుంది. అలా అని వర్షం పడుతున్న ప్రతిసారి ఇంట్లో ఏదో ఒకటి చేసుకుని తినే వీలు, సమయం రెండూ దొరకవు. బయటకు వెళితే రకరకాల స్నాక్స్ దొరుకుతాయి.
అయితే స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యానికి మంచివి కాదని అంతా అంటుంటారు. నిజానికి స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఆరోగ్యానికి హాని చేసివే ఉండవట. మనం కొంచెం ఆలోచిస్తే, కాస్త వెతికితే ఆరోగ్యానికి మేలు కలిగించే ఆహార పదార్థాలెన్నో వీధుల్లో దొరుకుతాయట. ఇంట్లో చేసుకునే సమయం లేక, వీలు లేక ఇబ్బంది పడే వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకనే వారు వీధుల్లో తినదగిన ఆహర పదార్థాలు కొన్ని ఉన్నాయట.
మొక్కజొన్న
వర్షాకాలం వచ్చిందంటే వీధుల్లో ఎక్కువగా కనిపించే స్నాక్స్ లలో మొక్కజొన్న ఒకటి. వీటిని ఉడికించి లేదా కాల్చిన తర్వాత కాసంత ఉప్పు, నిమ్మకాయ రుద్ది అమ్ముతుంటారు. ఇది తింటే వావ్ అనిపించడమే కాక, ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.
భేల్ పూరీ
క్రంచీ క్రంచీగా అంటే కారంకారంగా, పుల్లపుల్లగా ఉండే భేల్ పూరీ అంటే చాలా మందికి ఇష్టం. వర్షాకాలంలో మన నాలుకకు సంతృప్తినిచ్చే ఆహారాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. మరమరాలు, ఉడికించిన ఆలూ, ఉల్లిపాయలు, పచ్చి మిరప, పళ్లీలు, కొత్తిమీర, నిమ్మరసంతో పాలు కొన్ని మసాలాలు కలిపి తయారు చేసే భేల్ పూరీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదట!
కబాబ్
ఈ స్మొకీ డిష్‌ను వర్షాకాలంలో ఎంజాయ్ చేసే వారు చాలా మంది ఉంటారు. పుట్టగొడుగులు, చికెన్, పెరుగు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేసినవి కనుక వీటిని మితంగా తినడం మంచిదేనట.