Health Benefits of Papaya :మనం హెల్దీగా ఉండటానికి రోజూ తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలూ అందుతాయని అంటారు. ఇందులో బొప్పాయి ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఒక నెలరోజుల పాటు బొప్పాయి పండునుఉదయాన్నేతినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. మరి.. డైలీ బొప్పాయి తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
మలబద్ధకం సమస్య తగ్గుతుంది :
బొప్పాయి పండ్లలో విటమిన్ ఎ, సి, ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్‌ను అందిస్తాయి. డైలీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గిన్నె బొప్పాయి ముక్కలు తినడం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చికెన్ అంటే చాలా ఇష్టమా? ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఒక్క పార్ట్ అస్సలు తినకండి!! - Which Chicken Part Is Not To Eat
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :
రోజూ బొప్పాయి పండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ పండులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే జీర్ణ సమస్యలతో బాధపడేవారు బొప్పాయిని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యంగా :
బొప్పాయి పండ్లలో లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ బొప్పాయి పండు తినడంవల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది :
ఈ పండులో ఉండే లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.. కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది. 2019లో "ప్రోస్టేట్ క్యాన్సర్" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. బొప్పాయి పండు ఎక్కువగా తినే పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 23 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని జియా టంగ్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన 'డాక్టర్ డాంగ్-లీ చాంగ్' పాల్గొన్నారు. బొప్పాయి ఎక్కువగా తినే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
- డైలీ బొప్పాయి పండును తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వివిధ రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- ఈ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
- మచ్చలు, ముడతలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ వస్తువులకూ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది! - ఎక్కువ కాలం వాడితే ఏం జరుగుతుందో తెలుసా? - Expiry Date for Household Items
కుక్క కరిస్తే శరీరంలో ఏం జరుగుతుంది? - రేబిస్ రాకుండా ఏం చేయాలి?? - How To Stop Rabies