తెలంగాణ

telangana

ETV Bharat / health

పరగడుపున బొప్పాయి తింటున్నారా? మీ బాడీలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా? - Health Benefits Of Papaya - HEALTH BENEFITS OF PAPAYA

Eating Papaya On Empty Stomach Benefits : తియ్యటి రుచితో పాటు పోషక విలువల ఉన్న బొప్పాయి పండును చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కానీ ఉదయాన్నే ఖాలీ కడుపుతో దీన్ని తినొచ్చా? తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Health Benefits Of Papaya
Health Benefits Of Papaya (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 5:56 PM IST

Eating Papaya On Empty Stomach Benefits: తాజాగా, తియ్యగా ఉండే బొప్పాయి పండును చాలా మంచి ఇష్టంగా తింటుంటారు. పోషకాలతో పాటు శక్తిమంతమైన ఎంజైమ్​లు బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి. రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు వైద్యులు చెబుతుంటారు. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే మనం తినే ఆహారంలోని ప్రొటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది.

ఈ పండులోని కెరోటినాయిడ్స్, ఆల్కలాయిడ్స్, మోనోటెర్ఫెనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, మినరల్స్, విటమిన్లు, సూక్ష్మపోషకాలు కలిసి శరీరంలోని రక్తప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. శక్తిని పెంపొందిస్తాయి. అయితే చాలా మందికి పరగడుపున తినే అలవాటు ఉంటుంది. అలా తినడం మంచిదేనా? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.

బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఈ పండు తినడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. గుండె పోటు, స్ట్రోక్ వంటి వాటిని నివారించడంలోనూ సహాయపడుతుంది.

మార్నింగ్ డిటాక్స్
బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ సహజమైన డిటాక్సిఫైయర్​లా పనిచేస్తాయి. పరగడుపునే తినడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతుంది. జీర్ణాశయం రోజంతా సజావుగా పనిచేయడానికి ఈ ప్రక్రియ చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్య అనేది ఉండదు.

గ్యాస్​ సమస్యకు చెక్
గ్యాస్, చెస్ట్ ఇరిటేషన్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి బొప్పాయి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఈ పండును తినడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

బరువు నియంత్రణ
బొప్పాయిలో తక్కువ కేలరీలు ఉన్నందున్న ఈ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఉదయాన్నే బొప్పాయి తినడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

రోగనిరోధక శక్తి పెరుగుదల
బొప్పాయిలో కెఫిక్ యాసిడ్, మైరిసెటిన్, విటమిన్ సి, ఎ, ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే పరగడపున బొప్పాయి పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కణాలపై దాడి చేసే అణువులు, ఫ్రీ రాడికల్స్​తో పోరాడే శక్తి కలుగుతుంది. మొత్తం మీద బొప్పాయి పండును పరగడపున తింటే వ్యాధుల నుంచి రక్షించే కవచంలా కాపాడుతుంది.

హెచ్చరిక: బొప్పాయిలో చాలా రకాల ప్రయోజనాలున్నప్పటికీ గర్భిణీలు పరగడుపునే వీటిని అస్సలు తినకూడదు.

ముఖ్య గమనిక :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నిమ్మకాయ తొక్కలను పడేస్తున్నారా? అయితే చాలా బెనిఫిట్స్​ మిస్ అయిపోతున్నట్లే! - Benefits Of Squeezed Lemon

జిడ్డు చర్మంతో ఇబ్బందా? ఈ నేచురల్ క్లెన్సర్లతో షైనింగ్ స్కిన్ మీ సొంతం! - Natural skin Cleansers

ABOUT THE AUTHOR

...view details