Health Benefits of Sprouted Fenugreek Seeds :ప్రతి వంటింట్లోనూ మెంతులు తప్పనిసరిగా ఉంటాయి. ఇవి వంటకాలకు చక్కటి రుచిని తెస్తాయి. అయితే.. వీటిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, రాగి, పొటాషియం, ఐరన్, కాల్షియం, రైబోఫ్లావిన్, మాంగనీసుతోపాటు.. విటమిన్లు ఎ, బి6, సి, కె వంటి పోషకాలెన్నో మెండుగా ఉంటాయని చెబుతున్నారు. అందుకే.. చాలా మంది వీటిని రాత్రి నానబెట్టి మార్నింగ్ తింటుంటారు. అయితే.. మెంతులను(Fenugreek Seeds) మొలకెత్తాక తీసుకుంటే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు నిపుణులు!
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :మీరు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. మొలకెత్తిన మెంతులను మీ డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. మొలకెత్తిన మెంతి గింజలలో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్లు ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం ద్వారా ఉబ్బరం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఇట్టే నయమవుతాయని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ :మొలకెత్తిన మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకుంటే.. ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. నీటిలో కరిగే పీచు ఇందులో దండిగా ఉంటుందట. అది పిండి పదార్థాలను గ్రహించుకోవటాన్ని నెమ్మదింపజేస్తుంది. ఫలితంగా గ్లూకోజు మోతాదులు అదుపులో ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
కరివేపాకు సరే - వేపాకు తింటున్నారా? - ఎన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చో తెలుసా?
బరువు తగ్గడానికీ :ఫలితంగా మొలకెత్తిన మెంతుల్లో.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. 2018లో 'Journal of Nutrition and Metabolism'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. 12 వారాల పాటు రోజుకు 3.5 గ్రాముల మొలకెత్తిన మెంతులను తీసుకుంటే.. 1.5 కిలోల బరువు తగ్గినట్టు తేలిందట. ఈ పరిశోధనలో.. షాహీద్ బెహెష్టి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ హసన్ మహ్దావి పాల్గొన్నారు. మొలకెత్తిన మెంతులు తింటే వాటిలోని పోషకాలు జీవక్రియను పెంచి బరువు తగ్గేందుకు సహకరిస్తాయని ఆయన చెప్పారు.
గుండె ఆరోగ్యానికీ మేలు : మెులకెత్తిన మెంతులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి.. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంతోపాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని సూచిస్తున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి : యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్స్, టానిన్లు పుష్కలంగా ఉండే మొలకెత్తిన మెంతులు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల బాడీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ స్థాయిలు మెరుగుపడతాయని చెబుతున్నారు.
Note :ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
శృంగారంపై ఆసక్తి తగ్గుతోందా? సంతానం కలగట్లేదా? ఇవి తింటే..