తెలంగాణ

telangana

ETV Bharat / health

డైలీ బ్లూబెర్రీలు తింటున్నారా? మీ బాడీలో జరిగే మార్పులివే! - Blueberries Health Benefits

Health Benefits Of Blueberries : హెల్దీగా ఉండాలంటే తాజా పండ్లు, కూరగాయలను డైట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బ్లూబెర్రీస్‌ తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

Health Benefits Of Blueberries
Health Benefits Of Blueberries

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 4:14 PM IST

Health Benefits Of Blueberries : సాధారణంగా పండ్లు, కూరగాయలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. అయితే ఒక్కో పండుకి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఇక పండ్లలలో అద్భుతమైన పోషకాలు కలిగిన వాటిలో బ్లూబెర్రీస్ ఒకటి. అసలు బ్లూ బెర్రీస్​ అంటే ఏమిటి? వీటిని రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

బ్లూబెర్రీస్​ అంటే ఏమిటి - బ్లూబెర్రీస్ చాలా చిన్నగా, గుండ్రంగా, తియ్యగా ఉంటాయి. ఇవి నీలం లేదా ఊదా రంగులో ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ బెర్రీలను కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలుస్తారు. అలాగే వీటిని అల్పాహారం, స్మూతీస్, సలాడ్‌లు, డెజర్ట్‌లు వంటి వివిధ వంటకాలలో ఉపయోగిస్తారు. ఇక దీని ప్రయోజనాల విషయానికి వస్తే..

యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉన్నాయి :బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా మన శరీరాలు ఫ్రీ రాడికల్స్‌ను విడుదల చేస్తాయి. దీనినే ఆక్సీకరణ ఒత్తిడి అని కూడా పిలుస్తారు. ఇది క్యాన్సర్‌ సహా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, రోగనిరోధక శక్తిని అదుపులో ఉంచుకోవడానికి మన రోజువారీ ఆహారంలో యాంటీ-ఆక్సిడెంట్లను చేర్చుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా బ్లూబెర్రీస్​ను తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు.

ఫైబర్ అధికంగా ఉంటుంది:బ్లూబెర్రీస్​లోఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని డైలీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయని అంటున్నారు.

క్యాలరీలు తక్కువగా ఉంటాయి:బ్లూ బెర్రీస్‌లో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. దాదాపు ఒక కప్పు తాజా బ్లూ బెర్రీస్‌లో 84 క్యాలరీలుంటాయి. అలాగే 85 శాతం నీరుంటుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు:బ్లూబెర్రీస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి అర్థరైటిస్‌ వల్ల వచ్చే నొప్పి, వాపును తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది:మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో బ్లూబెర్రీలు అద్భుతంగా ప‌ని చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇది బ్రెయిన్‌కు బూస్టింగ్‌ ఇచ్చే ఒక స్నాక్‌ ఐటమ్‌ అని అంటున్నారు.

సాధారణంగా రోజూ సగం కప్పు నుంచి ఒక కప్పు వరకు బ్లూబెర్రీలను తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది సుమారు 75 నుంచి 150 గ్రాములకు సమానం. వీటిని పండ్ల రూపంలో లేదా డ్రై ఫ్రూట్స్ రూపంలో ఎలా తీసుకున్నా కూడా మ‌న‌కు మేలు చేస్తాయ‌ని చెబుతున్నారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

  • బ్లూబెర్రీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందిలో కడుపు ఉబ్బరం, గ్యాస్‌, అతిసారం వంటి సమస్యలు రావొచ్చు.
  • కిడ్నీలో రాళ్లు ఉన్న వారు వీటిని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
  • బ్లూబెర్రీలలో కొంత పెస్టిసైడ్స్ వంటి అవశేషాలు ఉండవచ్చు. కాబట్టి, వీటిని బాగా కడిగిన తర్వాత తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

టీ మళ్లీ మళ్లీ వేడి చేసి తాగొచ్చా? కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉందా?

జొన్నరొట్టెలు చేయడం రావడం లేదా? - ఈ టిప్స్​ పాటిస్తే చాలా ఈజీగా ​!

రోజూ పుదీనా తింటున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులివే!

ABOUT THE AUTHOR

...view details