తెలంగాణ

telangana

ETV Bharat / health

అశ్వగంధతో మగవారికి ఇన్ని ప్రయోజనాలా! ఈ 10 తెలిస్తే ఇప్పుడే స్టార్ట్​ చేస్తారు!!

Health Benefits Of Ashwagandha For Men : ఆయుర్వేదంలోని ఎన్నో మూలికల్లో అశ్వగంధ అత్యంత ముఖ్యమైనది. మగవారికి అన్ని రకాలుగా మేలు చేసే అశ్వగంధను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా, మానసికంగా ఎంతో మంచి జరుగుతుందని ఆయుర్వేదం వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ అశ్వగంధ అనేది ఏంటి? దీని వల్ల మగవారికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

10 Health Benefits Of Ashwagandha For Men
10 Health Benefits Of Ashwagandha For Men

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 2:10 PM IST

Updated : Mar 20, 2024, 2:17 PM IST

Health Benefits Of Ashwagandha For Men :భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో కేవలం అనారోగ్యాలకు ఉపాయాలు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాలను కూడా కూలంకశంగా వివరించారు. మనకు విరివిగా అందుబాటులో ఉండే వాటి నుంచి అరుదుగా లభించే వస్తువుల వరకు ప్రతి దాని ప్రయోజనాలను ఆయుర్వేదంలో క్షుణ్ణంగా తెలిపారు. ఇలా ఆయుర్వేదంలో ప్రముఖంగా అశ్వగంధ గురించి కూడా ప్రస్తావించారు. ఇంతకీ అశ్వగంధం అంటే ఏంటి? దానిని మగవారు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అశ్వగంధ అంటే ఏంటి?
అశ్వగంధ అనేది ఒక పొద. ఇది ఆసియా, ఆఫ్రికాలో పెరిగే ఒక సతత హరిత పొద. శాస్త్రీయంగా దీనిని విటానియా సోమ్నిఫెరా అని పిలుస్తారు. ఆయుర్వేదంలో కొన్ని వందల ఏళ్లుగా అశ్వగంధ ప్రస్తావన ఉంది. శరీరానికి పూర్తిగా మేలు చేసే ఈ మూలికను మగవారు తీసుకుంటే రెట్టింపు ప్రయోజనం కలుగుతుందని ఆయుర్వేదంలో వివరించారు.

మగవారు అశ్వగంధను తీసుకోవడం వల్ల కలిగే పది ప్రయోజనాలు

  1. ఒత్తిడి, ఆందోళన దూరం
    పురుషులు అశ్వగంధను తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది పురుషుల్లో విడుదలయ్యే కార్టిసాల్​ లాంటి ఒత్తిడి హార్మోన్లను అదుపులో ఉంచుతుంది. తద్వారా మీరు ప్రశాంతతను పొందగలుగుతారు. అలాగే ఒత్తిడి అనే భావన మీకు కలగకుండా చేస్తుంది.
  2. రక్తంలో చక్కెర, కొవ్వు కంట్రోల్​
    మధుమేహంతో బాధపడే మగవారికి ఇది దివ్య ఔషధం అని ఆయుర్వేదం చెబుతోంది. అశ్వగంధను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. అలాగే రక్తంలోని కొవ్వు స్థాయులను నిర్వహించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఫలితంగా శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
  3. కండరాల పెరుగుదల
    మగవారిలో కండరాలు బాగా పెరగడానికి అశ్వగంధ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా జిమ్​కు వెళ్లే వారికి ఇది అత్యద్భుతంగా పని చేస్తుంది. కండరాలు పెరగడమే కాకుండా బలంగా కూడా చేస్తుంది. మంచి బలంతో పాటు దృఢంగా కనిపించే కండరాలు కోరుకునే మగవారికి అశ్వగంధ ఓ మంచి ఔషధం అని ఆయుర్వేదంలో వివరించారు.
  4. గుండె ఆరోగ్యం పదిలం
    అశ్వగంధ తినడం వల్ల మన గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు అశ్వగంధ తీసుకున్న వారిలో కొలెస్ట్రాల్​ స్థాయులు చాలా వరకు తగ్గుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఫలితంగా గుండె పనితీరు ఎంతో మెరుగవుతుంది.
  5. నిరాశకు చెక్​
    అశ్వగంధ తీసుకోవడం వల్ల నిరాశగా ఉండే ఆడ, మగ వారికి మంచి ఉత్సాహం లభిస్తుంది. దీనిని సహజ సిద్ధ మూడ్​ బూస్టర్​గా చెప్పుకోవచ్చు. ఇది శరీరంలో సెరోటోనిన్​, డోపామైన్​ లాంటి ఫీల్-గుడ్​ న్యూరోట్రాన్స్మిటర్ల స్థాయులను మార్చి నిరాశ నుంచి బయటపడేస్తుంది. అయితే వైద్యుడి సలహా మేరకు అశ్వగంధను ఈ ప్రయోజనం కోసం వాడటం ఉత్తమం.
  6. అలసట నుంచి రిలీఫ్​
    బద్ధకం మిమ్మల్ని వేధిస్తోందా? మీరు ఒత్తిడికి గురవుతున్నారా? అలసటగా అనిపిస్తుందా? వీటన్నింటికి దివ్యమైన ఔషధం అశ్వగంధ. కాఫీ తాగితే మన శరీరం ఎలా అయితే అలసట నుంచి విముక్తి కలిగినట్లుంటుందో అలాంటి భావనను ఇస్తుంది. అలసటతో బాధపడే వాళ్లు దీర్ఘకాలంలో అశ్వగంధను ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
  7. టెస్టోస్టెరాన్‌ స్థాయులు పెరుగుతాయి
    పిల్లల కోసం ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీకు సంతానోత్పత్తి అవకాశాలు పెరగడానికి అశ్వగంధను తీసుకోండి. అశ్వగంధ తీసుకునే వారిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ అని అందువల్ల సంతానోత్పత్తి అవకాశాలు అధికంగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది. అలాగే పురుషులలో వీర్య కణాల సంఖ్య పెరగడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. సాధారణ పురుషుల కన్నా అశ్వగంధ వాడే పురుషుల వల్ల గర్భధారణ 14% పెరిగినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
  8. జ్ఞాపకశక్తి పెరుగుదల
    అశ్వగంధ కేవలం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మెదడు బాగా పని చేసేలా చేస్తుంది. రోజుకు 600 మిల్లీగ్రాముల అశ్వగంధను రెండు పూటలా 300 ఎంజీ చొప్పున తింటే మానసికంగా ఎంతో మేలు కలుగుతందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ పనులు చేసే వారికి ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. మీ ఫోకస్ పవర్​ను మెరుగుపరుస్తుంది.
  9. రోగనిరోధకశక్తి బూస్టర్​
    అశ్వగంధ మీ రోగనిరోధక వ్యవస్థను అద్భుతంగా పెంచుతుంది. ఫలితంగా మీరు త్వరగా జబ్బు బారిన పడే అవకాశాలు ఉండవు. మీ శరీరం ఎంతో ఉత్సాహంగా ఉండటమే కాకుండా అశ్వగంధ మిమ్మల్ని రోగాలకు దూరంగా ఉంచుతుంది.
  10. స్టామినా పెరుగుదల
    అశ్వగంధ తినడం వల్ల మగవారిలో కలిగే ప్రయోజనాల్లో స్టామినా పెరుగుదల ఒకటి. ఇది తినడం వల్ల త్వరగా అలసిపోకుండా పూర్తి స్టామినాతో పని చేస్తారు. ఫలితంగా ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రక్తం రాలేదని తల గాయాన్ని వదిలేస్తే ప్రమాదమే! వెంటనే ఏం చేయాలి?

మీ నోరు క్లీన్​గానే ఉందా? లేకుంటే ఆ మూడు వ్యాధులు వచ్చే ఛాన్స్​- జాగ్రత్త!

Last Updated : Mar 20, 2024, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details