Health Benefits of Apricots: మనం ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ.. వ్యాయామం చేస్తుండాలి. కానీ ప్రస్తుతం చాలా మంది పలు కారణాల వల్ల వ్యాయామం చేయడం లేదు సరికదా జంక్ ఫుడ్‌ను అధికంగా తీసుకుంటున్నారు. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే హెల్దీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి ఆప్రికాట్స్. వీటిని డైలీ ఉదయం తినడం వల్ల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు అంటున్నారు. వీటిని రోజూ ఉదయం తింటే ఎన్నో లాభాలు కలుగుతాయని వివరిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
జీర్ణ వ్యవస్థకు మేలు: ఆప్రికాట్స్‌ను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. జీర్ణవ్యవస్థశుభ్రంగా మారుతుందని.. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. వీటిని తింటే జీర్ణాశయం, పేగులు క్లీన్ అవుతాయని.. అలాగే గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, అజీర్తి సైతం తగ్గుతాయని చెబుతున్నారు.
చర్మ ఆరోగ్యం కోసం:ఆప్రికాట్స్‌లో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని.. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు. ఇవి చర్మ కణాలను రిపేర్ చేస్తాయని.. దీంతో చర్మం పొడిబారడం తగ్గుతుందని అంటున్నారు. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుందని.. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయని చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారికి.. అధిక బరువుతో బాధపడేవారు ఎంతో మంది. అయితే.. అలాంటి వారికి ఆప్రికాట్స్ ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని తింటే శరీరంలోకి కేలరీలు ఎక్కువగా చేరవని చెబుతున్నారు. పైగా ఎక్కువసేపు కడుపు నిండిన భావనతో ఉంటారని, దీంతో ఆహారం తక్కువగా తింటారని అంటున్నారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుందని సూచిస్తున్నారు. కనుక అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు రోజూ ఉదయం ఆప్రికాట్స్‌ను తింటుంటే ఫలితం ఉంటుందని అంటున్నారు.
బీపీ కంట్రోల్:ఆప్రికాట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుందని అంటున్నారు. అలాగే ఇందులో ఉండే పొటాషియం.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని.. బీపీని నియంత్రిస్తుందని చెబుతున్నారు.