Health Benefits Of Almonds :ఆరోగ్యకరమైన ఆహారం అనగానే ఈ మధ్య టక్కున అందరికీ గుర్తొస్తున్న పేరు బాదం పప్పు. ఫుల్ ప్యాక్‌డ్ న్యూట్రియంట్లతో ఉండే బాదంపప్పులు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయట. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో బాదం పప్పులు ఏమాత్రం తగ్గవు. అందుకే ఈ మధ్య చాలా మంది తమ డైలీ రోటీన్లో వీటిని భాగం చేసుకుంటున్నారు. అయినప్పటికీ వీటి గురించి చాలా మందికి తెలియని అరుదైన ప్రయోజనాలను ఒక్కసారి తెలుసుకుందాం.
మెదడును చురుకుగా!
బాదంపప్పుల్లో రిబోఫ్లేవిన్, ఎల్ కార్నిటైన్, న్యూట్రియంట్లు అధికంగా ఉండి మెదడు పనితీరును మెరుగు చేస్తుంది. న్యూరోడీజనరేటివ్ జబ్బులైన అల్జీమర్స్ లాంటివి రాకుండా కాపాడుతుంది.
జీర్ణవ్యవస్థలో మెరుగుదల
జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటేనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండగలరు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మల విసర్జన సాఫీగా జరిగి మలబద్దకం దరి చేరదు.
గుండెకు మేలు
ఆరోగ్యకరమైన మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తాయి బాదంపప్పులు. వీటిని రోజూ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగవుతాయట. రోజుకు మూడు బాదంపప్పులు కార్డియోవాస్క్యులర్ హెల్త్‌కు మంచివట.
షుగర్ కంట్రోల్
డయాబెటిస్ రాకుండా ఉండటానికి, రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచడానికి బాదంపప్పులు బాగా సహకరిస్తాయి. కొన్ని స్టడీలలో వీటి వాడకం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగినట్లు స్పష్టమైంది.
చర్మారోగ్యంలో మెరుగు
స్కిన్ చాలా ప్రకాశవంతంగా మెరుగ్గా కనిపించడానికి సహజ పద్ధతిని వాడాలనుకుంటే అందుకు బాదంపప్పులు కరెక్ట్ ఆప్షన్. విటమిన్ ఈ అధికంగా ఉండి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి చర్మంలోని కణాలు డ్యామేజీ కాకుండా కాపాడుతాయి. ఫలితంగా యవ్వనవంతమైన చర్మాన్ని పొందొచ్చు.
ఎముకల్లో పటుత్వం
యాక్టివ్ లైఫ్‌స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఎముకల్లో పటుత్వం చాలా అవసరం. వీటిల్లో ఉండే కాల్షియం, పాస్పరస్‌లు ఎముకల బలానికి బాగా ఉపయోగపడతాయి. ఈ మినరల్స్ ఎముకల సాంద్రతను పెంచి గాయాల నుంచి రక్షిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కేశారోగ్యం
ఒత్తైన, ఆరోగ్యవంతమైన కేశాలు కావాలనుకునేవారికి బాదంపప్పులు ఒక సీక్రెట్ వెపన్ అనే చెప్పాలి. బయోటిన్, బీ విటమిన్లు కేశాలు పెరగడానికే కాకుండా బలంగా తయారవడానికి కూడా సహాయపడతాయి. బయెటిన్ తగ్గి జుట్టు పలచబడకుండా బాదంపప్పులు కాపాడతాయి.
రోగ నిరోధక శక్తి
జబ్బుల బారిన పడకుండా బాదంపప్పులు సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అయిన విటమిన్ ఈ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగైనట్లు యూరోపియన్ స్టడీ వెల్లడించింది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.