ETV Bharat / entertainment

క్రిస్మస్ స్పెషల్ - OTTలోకి రూ.400 కోట్ల వసూళ్ల సినిమా! - THIS WEEK OTT RELEASE

OTTలోకి రూ.400 కోట్ల వసూళ్ల సినిమా - ఎక్కడ చూడాలంటే?

Bhool Bhulaiyaa 3 OTT
Bhool Bhulaiyaa 3 OTT (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2024, 5:15 PM IST

Bhool Bhulaiyaa 3 OTT : బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన 'భూల్ భులయ్యా 3' ఆ మధ్య బాక్సాఫీస్ ముందుకు వచ్చి భారీ హిట్​ను అందుకున్న సంగతి తెలిసిందే. పాపులర్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ మూడో చిత్రం బ్లాక్​ బస్టర్​ టాక్​తో పాటు మంచి వసూళ్లను కూడా దక్కించుకుంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్​కు రెడీ అయింది.

ఏ ఓటీటీలో అంటే?

'భూల్ భులయ్యా 3' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్​ను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ దక్కించుకుంది. క్రిస్మస్​ సందర్భంగా డిసెంబర్​​ నాలుగో వారంలో నెట్‍ఫ్లిక్స్ స్ట్రీమింగ్​కు తీసుకురానున్నట్టు సమాచారం అందింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 27 వస్తుందని టాక్ వినిపిస్తోంది. లేదంటే జనవరి తొలి వారంలో విడుదల అయ్యే ఛాన్స్ ఉందని రూమర్స్ వస్తున్నాయి. చూడాలి మరి ఈ వారంలో భూల్ భులయ్యా 3 స్ట్రీమింగ్‍కు వస్తుందో లేదో.

'భూల్ భులయ్యా 3'లో రుహాన్ అలియాజ్ రూబ్ బాబాగా కార్తీక్ ఆర్యన్ తన నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ నటులు విద్యాబాలన్, మాధురీ దీక్షిత్‍తో పాటు త్రిప్తి దిమ్రి కూడా నటనతో మెప్పించింది. విజయ్ రాజ్, రాజ్‍పాల్ యాదవ్, సంజయ్ మిశ్రా, రాజేశ్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. హారర్ ఎలిమెంట్లతో పాటు కామెడీ కూడా సినిమాలో హైలెట్​గా నిలిచింది. మొత్తంగా రూ.150 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.417 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. స్త్రీ 2 తర్వాత ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. సినిమాను భూ టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 బ్యానర్లపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మించారు. ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్లు సినిమాకు సంగీతం అందించారు. అనూ ఆనంద్ సినిమాటోగ్రఫీ చేశారు.

'స్క్విడ్​ గేమ్'​ టు 'బేబీ జాన్'​ - ఈ వారం థియేటర్​ / ఓటీటీలో అలరించనున్న టాప్ కంటెంట్ ఇదే!

'డాకు మహారాజ్‌' కోసం మూడు భారీ ఈవెంట్‌లను ప్లాన్ చేశాం : నిర్మాత నాగవంశీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.