Red Vs Green Apple Which One Is Better :పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, డయాబెటిస్ ఉన్నవారుపండ్లు తినాలన్నా భయపడిపోతుంటారు. ఎందుకంటే.. పండ్లలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. ఒకవేళ తినాలనుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లను ఎంచుకుంటుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి.. యాపిల్. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అసలు ప్రాబ్లమ్ వచ్చేసరికి.. మార్కెట్లో రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్ అనేవి లభ్యమవుతుంటాయి. ఈ క్రమంలోనే డయాబెటిస్ ఉన్న చాలా మందిలో ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి బెటర్ అనే సందేహం వస్తుంటుంది. ఇంతకీ, వీటిలో మధుమేహం(Diabetes) ఉన్నవారికి ఏది మంచిది? దేని వల్ల ఎక్కువ ప్రయోజనాలు? నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిజానికి యాపిల్ తినడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, మార్కెట్లో లభించే రెడ్, గ్రీన్ యాపిల్స్‌లో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. కానీ, డయాబెటిస్ పేషెంట్స్ విషయానికొస్తే.. రెడ్ యాపిల్స్ కంటే గ్రీన్ యాపిల్స్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా.. గ్రీన్ యాపిల్ చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుందట. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచి.. టైప్ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. కాబట్టి.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గ్రీన్ యాపిల్ ఎంతో మేలు చేస్తుందని సూచిస్తున్నారు.
2018లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 12 వారాల పాటు రోజుకు మూడు ఆకుపచ్చ ఆపిల్స్ తిన్న టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో.. రోజుకు మూడు ఎరుపు ఆపిల్స్ తిన్న వారి కంటే.. వారి రక్తంలో చక్కెర స్థాయిలు, HbA1c స్థాయిలు గణనీయంగా తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కెనడాలోని టొరంటోలోని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ డానా ఝు పాల్గొన్నారు. మధుమేహం ఉన్నవారు రెడ్ యాపిల్స్ కంటే గ్రీన్ యాపిల్స్ తినడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని డానా ఝు పేర్కొన్నారు.
అలర్ట్: ఎగ్స్ తింటే షుగర్ వస్తుందా? - పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు!
గ్రీన్ యాపిల్స్ ఇతర ప్రయోజనాలు చూస్తే..