Foods That Make You Feel Angry : కొన్ని ఆహార పదార్థాలు తిన్నామంటే మనం హ్యాపీగానో, చికాకుగానో ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మనపై శారీరకంగానే కాకుండా మానసికంగానూ ప్రభావం చూపిస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు మెదడు నుంచి నెగెటివ్ సిగ్నల్స్ పంపించి మిమ్మల్ని కోపంతో ఊగిపోయేలా చేస్తుంది. మరి అటువంటి ఆహారం తెలుసుకుని ముందే దూరంగా ఉంచడం మంచిది కదా.
ప్రోసెస్‌డ్ ఫుడ్స్:
షుగర్ ఐటెమ్స్ అయిన ప్రోసెస్‌డ్ ఫుడ్స్ మనకు తక్షణ శక్తినిచ్చి, ఎనర్జీ బూస్టింగ్‌కు ఉపయోగపడుతుంది. అయితే, ఎక్కువగా పాలిష్ చేసుకున్న ఫుడ్స్, రిఫైన్డ్ షుగర్స్ పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెంచేస్తాయి. ఫలితంగా మూడ్ స్వింగ్స్ జరిగి చికాకును తెప్పిస్తాయి. మీకు బ్యాలెన్స్‌డ్ మూడ్ ఉండాలని అంటే ప్రోసెస్ చేయని ఆహారం తీసుకోవడం మంచిది.
ఎక్కువ మోతాదులో కెఫీన్
చాలా మంది రెగ్యులర్ లైఫ్‌లో కెఫీన్ (కాఫీ) తీసుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది. కాకపోతే ఇది తీసుకునే మోతాదు ఎక్కువైతే మాత్రం మీ ఫీలింగ్స్‌కు విశ్రాంతి లేకుండాపోతుంది. కెఫీన్ ఎక్కువ కావడం వల్ల నిద్ర కూడా కరవైపోతుంది. చికాకు, కోపం లాంటి ఫీలింగ్స్‌కు దారితీస్తుంది. కెఫీన్ తీసుకోవడం తగ్గించుకోవాలంటే దాని బదులుగా హెర్బల్ టీ లాంటివి తీసుకోవడం ఉత్తమం.
ఆల్కహాల్
రోజులో మోతాదుగా ఆల్కహాల్ తీసుకుంటే రిలాక్స్ అయినట్లు అనిపిస్తుంది. కానీ, ఎక్కువగా తీసుకుంటే మాత్రం చికాకుతో పాటు మూడ్ స్వింగ్స్‌కు దారి తీస్తుంది. మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్లను ఆల్కహాల్ ప్రభావితం చేసి ఎమోషన్స్‌కు బ్యాలెన్స్ లేకుండా చేస్తుంది. ఆల్కహాల్ మీ మూడ్‌ను మార్చనంత వరకు మాత్రమే తీసుకోవడం అలవాటు చేసుకోండి.