Mood Boosting Foods In Your Daily: ఆనందంగా ఉండాలంటే కేవలం మనం చేసే పనులు, మన చుట్టూ ఉండే పరిస్థితులు మాత్రమే కారణం కాదండీ తినే ఫుడ్ ద్వారా కూడా ఆనందంగా ఉండొచ్చని మీకు తెలుసా. అంటే టేస్టీగా ఉండే ఫుడ్ తిని సంతృప్తిగా ఉంటే వచ్చే హ్యాపీనెస్ గురించి కాదు చెప్పేది. మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందట. ఆ ఫుడ్ గురించి తెలుసుకుంటే కావాల్సినప్పుడల్లా కావలసినంత హ్యాపీగా ఉండొచ్చు.
బెర్రీస్:యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండే బెర్రీస్ కారణంగా డోపమైన్ బూస్టింగ్ జరుగుతుంది. ఈ బెర్రీలు చలువదనాన్ని పెంచి డోపమైన్ ఉత్పత్తి మెరగయ్యేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ కూడా ఉంటుంది.
అరటిపండ్లు :విటమిన్ బీ6 ఎక్కువగా ఉండే అరటిపండ్లో హ్యాపీగా ఉంచే సెరొటోనిన్ హార్మోన్ ఉత్తత్తికి సహకరిస్తాయి. ఫలితంగా నిద్రను క్రమబద్దీకరించి మంచి మూడ్‌ను మెయింటైన్ చేసేందుకు తోడ్పడతాయి. వీటిల్లో నేచురల్ షుగర్స్, ఫైబర్ ఉండి తక్షణ శక్తిని పొందేందుకు వీలవుతంది.
విత్తనాలు, ధాన్యాలు : బాదంపప్పుడు, చియా గింజల్లో మెగ్నీషియం, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ పనితీరు, మూడ్ రెగ్యూలేషన్‌కు సహాయపడతాయి. బాదంపప్పులు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచివి. మంచి న్యూట్రియంట్లను అందించి మంచి న్యూరోట్రాన్స్‌మిట్టర్‌గా పని చేస్తాయి. వీటితో పాటుగా డిప్రెషన్, యాంగ్జైటీ లక్షణాలను తగ్గిస్తాయి.
ఫ్యాటీ ఫిష్ :ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మోన్, మక్కెరెల్, సార్డిన్‌లు తినడం వల్ల సెరోటిన్ లెవల్స్‌ను ఉత్తేజితపరిచి బ్రెయిన్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్‌గా ఆరోగ్యంగా ఉంచుతాయి.
ప్రోబయాటిక్స్ :యోగర్ట్, కేఫిర్, సార్క్రాట్ లలో ప్రోబయాటిక్స్ ఉండి మలవిసర్జన సాఫీగా జరిగేందుకు సహకరిస్తాయి. మన మెదడు పనితీరు, మూడ్‌లను మార్చేందుకు ఇది చాలా కీలకం.