తెలంగాణ

telangana

ETV Bharat / health

ఉపవాసం Vs తక్కువగా తినడం Vs ఎర్లీగా భోజనం చేయడం- బరువు తగ్గడానికి ఏది బెస్ట్ ఆప్షన్​? - BEST FOOD HABITS FOR WEIGHT LOSS

ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఊబకాయం సమస్య- ప్రపంచంలో ప్రతి 8మందిలో ఒకరు ఒబెసిటీతో బాధపడుతున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడి - ఇలా చేస్తే బరువు తగ్గొచ్చట!

weight loss TIPS
weight loss TIPS (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2024, 12:45 PM IST

Best Food Habits For Weight Loss :ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ పరిశోధనలో తేలింది. శరీరంలో అధిక కొవ్వు కారణంగా టైప్- 2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని వెల్లడైంది. ఊబకాయం వల్ల తలెత్తే సమస్యలు, ఒబెసిటీని అరికట్టే మార్గాలపై ఆస్ట్రేలియాలోని బాండ్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు హేలీ ఓనీల్, లోయి అల్బర్‌ కౌనీ సంయుక్తంగా ఓ అధ్యయనం చేశారు.

రీసెర్చ్ ప్రకారం
అధిక బరువు వల్ల ఊబకాయం వస్తుంది. అందుకే ఊబకాయం నుంచి బయటపడాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. తక్కువ క్యాలరీలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ఒబెసిటీతో బాధపడుతున్నవారు బరువు తగ్గడం కోసం తక్కువ మోతాదులో ఆహారం తినడం, కాస్త త్వరగానే డిన్నర్ చేయడం సహా అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి. ఈ మూడింటి వల్ల బరువు తగ్గొచ్చని రీసెర్చ్​లో తేలింది. పరిశోధకులు 12 వారాలకుపైగా 2,500 మందిపై అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించారు. దీని ప్రకారం దాదాపు ఒక్కొక్కరు 1.4 - 1.8 కేజీల బరువు తగ్గారని పేర్కొన్నారు.

త్వరగా తినడమే బెటర్​
జీవక్రియ సరిగ్గా లేనప్పుడు మానవ శరీరం ఇన్సులిన్​ను సరిగ్గా ఉత్పత్తి చేయదు. దీంతో బరువు పెరగడం, అలసట, మధుమేహం సహా అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం పెరుగుతుంది. అర్ధరాత్రి చిరుతిళ్లు తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలాగే రాత్రివేళ ఎక్కువ ఆహారం తిన్నా సరిగ్గా జీర్ణం కాదు. దీంతో రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి. అయితే రాత్రి పూట వీలైనంత త్వరగా భోజనం చేయడం వల్ల వల్ల బరువు తగ్గడమనేది అందరి విషయంలో సాధ్యం కాకపోవచ్చు. కొందరు రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోతారు. మరికొందరు పూర్తిగా నిద్రపోరు. క్రోనోటైప్ ఉన్న వ్యక్తులు రాత్రి వేళ కాస్త త్వరగానే డిన్నర్ చేసినా బరువు తగ్గుతారని కచ్చితంగా చెప్పలేము.

తక్కువ తినడం
సాధారణంగా చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ చేస్తారు. ఇంకొందరు 1-2సార్లు తింటారు. వీటితో పోలిస్తే తక్కువ మోతాదులో రోజుకు ఆరుసార్లు తినడం వల్ల బరువు తగ్గొచ్చని ఇటీవల పలు అధ్యయనాల్లో తేలింది. అయితే తప్పనిసరిగా స్వల్ప మోతాదులోనే తినాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు, బాండ్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం రోజుకు మూడు సార్లు భోజనం చేస్తే చాలు. ఆరుసార్లు కంటే మూడు సార్లు తినడమే మంచిదని తేలింది. అల్పాహారం, లంచ్, డిన్నర్ చేస్తే సరిపోతుంది. స్నాక్స్​కు దూరంగా ఉండాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్ తినేసిన తర్వాత రాత్రిపూట డిన్నర్ వీలైనంత త్వరగా చేసేయాలి.

ఉపవాసం
రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల ఆరోగ్యం, శరీర అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ఇది కాలక్రమేణా టైప్-2 డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా నైట్​షిఫ్ట్ చేసే వారు ఈ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమయానికి భోజనం చేయడం, అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అందుకే పగలే 6-10 గంటల వ్యవధిలో మీ శరీరానికి కావాల్సిన కేలరీలను అందించేయాలి. సమయానికి తగిన విధంగా తినడం వల్ల రోజుకు 200 కేలరీలు తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు.

ఏది బెటర్?
గతంలో వైద్యులు బరువు తగ్గడం కోసం కేవలం కేలరీల బ్యాలెన్స్​నే చూసేవారు. అయితే ప్రస్తుతం తినే ఆహారం, సమయానికి భోజనం, ఎన్నిసార్లు తింటున్నారు? వంటి విషయాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. బరువు తగ్గడానికి సులభమైన మార్గాలు లేవు. కాబట్టి మీకు బాగా సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం మంచిది.

ఇవీ ముఖ్యమే
రోజులో ఏదైనా ఎనిమిది గంటల విండోలో మాత్రమే తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. అలాగే బ్రేక్ ఫాస్ట్, లంచ్​​లోనే ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోండి. రాత్రి పూట కాస్త త్వరగా భోజనం ముగించండి. ఈ విధంగా రోజుకు మూడుసార్లు ఆహారాన్ని తినడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details