Fast For 14 Hours Health Benefits :మనలో చాలా మంది దేవుడిపై భక్తితో ఉపవాసం ఉంటారు. ఇంకొందరు బరువు తగ్గడానికి ఫాస్టింగ్ ఉంటారు. పురాతన కాలం నుంచి వస్తున్న ఉపవాస నియమాన్ని ఎక్కువ మంది పండగల సమయంలో పాటిస్తుంటారు. మరికొందరు మాత్రం వారానికి ఒక రోజైనాఫాస్టింగ్(Fasting) ఉంటుంటారు. అయితే, ఈ రోజుల్లో ఎక్కువసేపు కడుపును ఖాళీగా ఉంచే ఉపవాస పద్ధతులు(ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్) చాలా ట్రెండ్ అవుతున్నాయి. అలాగే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నట్టు ఆధునిక పరిశోధనలు సైతం పేర్కొంటున్నాయి. అయితే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో 14 గంటలు ఉపవాసం ఉంటూ, ఆపై 10 గంటల్లో రోజుకు సరిపడా ఆహరం తీసుకునే విధానం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు ఇటీవల కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.
ముఖ్యంగా ఈ పద్ధతిని పాటించడం ద్వారా కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ అదుపులో ఉండటమే కాకుండా బరువు తగ్గుతూ రక్తపోటు నియంత్రణలో ఉండటం వంటి పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, చాలా మంది ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలు పొందేందుకు కఠిన ఉపవాస నియమాలు పాటిస్తుంటారు. ఇందులో అంతటి కఠిన నియంత్రణలు పాటించాల్సిన అవసరం లేదని రోజులో పది గంటల సమయంలో భోజనాలను ముగించడం, మిగిలిన 14 గంటలు ఏమీ తినకుండా ఉంటే చాలని అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు స్పష్టం చేశారు. అలాగే ఈ విధానాన్ని చాలా మంది అనుసరించే వెసులు బాటు ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఈ ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్‌తో అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఎనర్జీ లెవెల్స్, మూడ్, ఆకలి వంటివి మెరుగయ్యాయని కూడా తేలింది.
ఉపవాసం మంచిదేనా? పరిశోధనల్లో ఏం తేలిందో తెలుసా?
14 గంటల పాటు ఉపవాసం ఉండటం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు :