Face Sweating Control Tips :అందరికన్నా అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. రోజంతా తాజాగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆశ పడతారు. కానీ చాలా మందికి ముఖం మీద విపరీతమైన చెమట వస్తుంది. నుదురంతా తడిసిపోతుంది. కాసేపు నడిచినా, ఏ చిన్న పని చేసినా చెమట కారిపోయి ముఖం జిడ్డుగా మారిపోతుంది. దీన్నే 'ఫేషియల్ హైపర్ హైడ్రెసిస్' అని కూడా పిలుస్తారు. బయటకు చెప్పకపోయినా ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కొందరిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. ముఖంపై చెమట పట్టకుండా ఎప్పుడూ తాజాగా కనిపించేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు మా దగ్గర ఉన్నాయి. అవేంటంటే?
నిజానికి నుదురు మీద ఎక్కువ చమట పట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో శారీరక శ్రమ, అధిక ఉష్ణోగ్రతతో, జన్యు పరమైన సమస్యలు, హార్మోన్లలో హెచ్చు తగ్గులు, ఒత్తిడి, ఆందోళన, నాడీ సంబంధిత రుగ్మతలు, ఊబకాయం తరచూ వాడే మెడిసిన్ ముఖ్య కారణాలు. మరి ఈ సమస్యను ఎలా అడ్డుకోవాలంటే?
- హైడ్రేషన్:చెమట నుంచి బయట పడాలంటే ముందు మీరు చేయాల్సిన పని ఎక్కువ నీటిని తాగడం. హెడ్రేటెడ్గా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండి ఎక్కువ చెమట పట్టకుండా ఉంటుంది.
- మసాలా ఫుడ్:స్పైసీ ఫుడ్ తినడం వల్ల శరీరానికి చెమట ఎక్కువ పడుతుంది. అందుకే ముఖం, నుదుటి మీద చెమటతో ఇబ్బంది పడే వారు ఆహారంలో మసాలాలు తగ్గించాలి.
- మద్యపానం:ఆల్కహాల్ కూడా శరీరంలో చెమటను పెంచుతుంది. మద్యపానం శరీరాన్ని డీ హైడ్రేట్ చేస్తుంది. డీ హైడ్రేషన్ కారణంగా ఎక్కువ చెమట పడుతుంది.
- స్నానం:తరచుగా స్నానం చేయడం వల్ల చెమట పట్టకుండా ఉంటుంది. పరిశుభ్రంగా ఉండటం వల్ల బ్యాక్టీరియాను అరికట్టవచ్చు.
- టాల్కమ్ పౌడర్:మీ శరీరంలో ఎక్కువగా చెమట పట్టే చోట తేమను గ్రహించగలిగే టాల్కమ్ పౌడర్ వేసుకొండి.
- బరువు:అధిక బరువు కూడా మీకు ఎక్కువ చెమట పట్టేలా చేస్తుంది. కాబట్టి మీ శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన BMI అధిక చెమటను తగ్గిస్తుంది.
- కోల్డ్ ప్యాక్స్:ముఖం మీద అప్పుడప్పుడు కోల్డ్ ప్యాక్స్ వేసుకుంటూ ఉండాలి. కాబట్టి అప్పుడప్పుడూ వీటిని వాడటం వల్ల చెమట సమస్య తగ్గుతుంది.
- ఒత్తిడి: టెన్షన్ పడటం వల్ల కూడా మనిషికి చెమట బాగా పడుతుంది. కాబట్టి మీ ఒత్తిడి ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకొండి. ఇందుకోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, మెడిటేషన్ లాంటివి చేయాలి.
- సున్నితమైన క్రీములు:మీరు తరచూ వాడే ఫేస్ క్రీములు సున్నితంగా ఉండేలా చూసుకొండి.ముఖ్యంగా యాంటీ పెర్పిరెంట్ గా ఉండే ఫేస్ క్రీములను మాత్రమే వాడండి.
- ఫేషియల్ వైప్స్: బయటకు వెళ్లినప్పుడు మీరు ముఖాన్ని తుడుచుకునేందుకు వాడే వైప్స్ ఆయిల్ ఫ్రీగా ఉండాలి. జిడ్డు కలిగిన వైప్స్ వాడితే మీ ముఖం రంధ్రాలు మూసుకుపోనివ్వకుండా చేసి చర్మాన్ని దెబ్బతీస్తాయి.