Avoiding Raw Vegetables : పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే, వీటిని ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకోవాల్సిందే. అయితే ఎంత మంచివి అయినప్పటకీ కొన్ని కూరగాయలను వండకుండా, అంటే పచ్చిగా తినడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని కూరగాయల్లో ఆరోగ్యానికి హాని చేసే బీ కొల్లై, టేప్ వార్మ్ వంటి హానికరమైన బ్యాక్టీరియాలుంటాయి. పచ్చిగా తినడం వల్ల ఈ బ్యాక్టీరియా ప్రేగుల్లోకి, రక్తనాళాల్లోకి, కొన్ని సార్లు మెదడులోకి కూడా ప్రవేశించి సిస్టిసెర్కోసిస్, మూర్ఛ, తలనొప్పి, కాలేయం దెబ్బతినడం, కండరాలలో తిత్తులు వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. అందుకే పచ్చిగా అస్సలు తినకూడని కూరగాయలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని రకాల ఆకుకూరలు
బచ్చలి కూర, కాలే, చేమదుంప ఆకులు వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. అయితే వీటిని పచ్చిగా అస్సలు తీసుకోకూడదు. వండేముందు కూడా వీటిని తప్పకుండా వేడి నీటిలో కడగాలి. ఎందుకంటే వీటిలో ఆక్సలేట్ స్థాయిలు, సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. వీటిని పచ్చిగా తినడం వల్ల గొంతు నొప్పి, మంట, చిరాకు వంటి ఇబ్బందులు కలుగుతాయి.
క్యాబేజీ
క్యాబేజీలో టేప్ వార్మ్‌లు, వాటి గుడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటికి కనిపించవు. పైగా క్యాబేజీ పెంపకం సమయంలో క్రిమిసంహారాలు, పురుగుల మందులు ఎక్కువగా వాడతారు. అందుకే క్యాబేజీని పచ్చిగా తినకూడదు. అందుకే బాగా కడిగి, తరువాత వేడి నీటిలో ఉడికించిన తర్వాత మాత్రమే దానిని వండాలి. వీటిని పచ్చిగా తినడం వల్ల థైరాయిడ్ గ్రంథులకు హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
క్యాప్సికమ్
ఎప్పుడైనా క్యాప్సికమ్ కాడను, లోపల ఉండే గింజలను తీసేసిన తర్వాతే వండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి హానికరమైన క్రీములకు నిలయంగా ఉంటాయి. వీటిని పచ్చిగా అస్సలు తీసుకోకూడదు.