Best Tips For Floor Cleaning :ఇంటి ఫ్లోర్ మీద పడిన మరకల్లో చాలా వరకు ఈజీగానే తొలగిపోయినపట్టికీ.. కొన్ని మరకలు మాత్రం అత తేలిగ్గా వదిలిపోవు. ఎంత శుభ్రం చేసినప్పటికీ.. ఇంకా వాటి తాలూకు గుర్తులు ఉండిపోతాయి. ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో టైల్స్ ఉంటున్నాయి. అయితే.. కొన్నిసార్లు వాటిపై పడ్డ మరకలు తొలగిపోవు. ఇలాంటి పరిస్థితుల్లో.. బంగాళ దుంపతో బాగా రుద్ది.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే టైల్స్ తళతళా మెరిసిపోతాయని చెబుతున్నారు.
- కొందరు ఎంత క్లీన్ చేసినా టైల్స్ మధ్య మురికి పోవట్లేదని బాధపడుతుంటారు. అలాంటి వారు వెనిగర్, గోరువెచ్చని నీటిని సమపాళ్లలో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ప్రే బాటిల్‌లో పోసి టైల్స్ మధ్య మురికి పేరుకున్న చోట స్ప్రే చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే మురికి వదిలిపోయి ఫ్లోర్ నీట్‌గా తయారవుతుందని చెబుతున్నారు.
సింక్‌లో నీళ్లు నిలిచిపోయాయా ? ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లం సాల్వ్!
- మార్బుల్స్ ఉన్నవారు గోరువెచ్చని వాటర్‌లో కాస్తంత నిమ్మరసం కలిపి క్లీన్ చేస్తే వాటిపై పేరుకుపోయిన మురికి ఈజీగా తొలగిపోతుందంటున్నారు.
- అదేవిధంగా.. నీళ్లలో బేకింగ్ సోడా యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఇందుకోసం ముందుగా వాటర్‌లో బేకింగ్ సోడా కలుపుకొని 10 నిమిషాల తర్వాత ఫ్లోర్‌పై స్ప్రే చేసుకోవాలి. ఆపై అరగంట ఆగాక క్లీన్ చేసుకుంటే చాలు ఫ్లోర్ శుభ్రంగా తయారవుతుందంటున్నారు.
- ఇంట్లో మిగిలిన గదులన్నింటిలోనూ ఫ్లోర్‌ను శుభ్రం చేయడం ఒకెత్తయితే.. కిచెన్‌లో నేలను శుభ్రం చేయడం మరో ఎత్తు. ఎందుకంటే.. వంట చేసేటప్పుడు చిందే నూనె కారణంగా అక్కడ జిడ్డుగా తయారవుతుంది. ఆ మరకలు అంత ఈజీగా తొలగిపోవు. అలాంటి టైమ్‌లో.. కిచెన్‌లో టైల్స్‌పై నూనె ఉంటే కార్న్ స్టార్చ్ వేయాలి. ఇది జిడ్డును పీల్చుకుంటుంది. ఆ తర్వాత డిటర్జెంట్ నీళ్లతో కడిగి శుభ్రం చేసుకుంటే చాలు.. క్లీన్‌గా మారుతుందంటున్నారు నిపుణులు.
- మరో చిట్కా ఏంటంటే.. పావు బకెట్ వేడినీళ్లలో అరకప్పు వెనిగర్ వేసి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఆపై దీనిలో మాప్‌ను ముంచి ఫ్లోర్‌ను శుభ్రం చేయాలి. అనంతరం పొడి వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది. ఇలా చేసినా ఫ్లోర్ మెరిసిపోతుందంటున్నారు.
- రాబోయేది వర్షాకాలం ఈ టైమ్‌లో బయట నుంచి ఇంటికొచ్చే వాళ్ల ద్వారా బురద, క్రిములు.. వంటివన్నీ ఇంట్లోకి చేరతాయి. అందులోనూ నేలపై అంటుకున్న మురికి, మరకలు ఓ పట్టాన వదలవు. అలాంటి టైమ్‌లో.. నైట్ నిద్రించే ముందు ఫ్లోర్‌పై బ్లీచింగ్ పౌడర్‌ను చల్లుకోవాలి. అనంతరం ఉదయాన్నే లేచి ఫ్లోర్ క్లీన్ చేస్తే మరకలన్నీ మటు మాయమైపోతాయంటున్నారు నిపుణులు.
How to Get Rid of Smell in Bathroom : ఈ టిప్స్ పాటించండి.. మీ బాత్రూమ్ దుర్వాసనొస్తే అడగండి..!