Hair Colour Tips :ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ జుట్టుకు డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తున్నారు. తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి ఓ కారణమైతే.. నలుగురిలో స్టైలిష్‌గా కనిపించడానికి కలర్స్ వేసుకుంటున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల జుట్టుకు వేసిన రంగులు తొందరగా ఫేడ్ అవుతాయి. దీంతో మళ్లీ సెలూన్లకు వెళ్లాల్సి వస్తుంది. అయితే జుట్టుకు వేసిన కలర్ ఎక్కువ రోజులు ఉండాలంటే కొన్ని టిప్స్ తప్పక పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
జుట్టుకు రంగు వేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల కొంత మందిలో అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీరు హెయిర్‌కు కలర్ వేయించుకోవాలని అనుకుంటే ఒక రోజు ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
- జుట్టుకు రంగు వేసుకునే ముందు కండిషనింగ్ చేయించుకోండి.
- అలాగే కలర్ వేసుకునే ముందు షాంపూతో తలస్నానం చేయకండి.
జుట్టుకు రంగు వేసిన తర్వాత ఈ టిప్స్ పాటించండి :
- హెయిర్‌కు రంగు వేసుకున్న తర్వాత అది ఎక్కువ రోజులు ఫేడ్ కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి.
- సాధారణంగా, చాలా మంది హెయిర్ కలర్ వేసుకున్న తర్వాతషాంపూతో తలస్నానం చేస్తుంటారు. అయితే హెయిర్‌కు కలర్ అప్లై చేసుకున్న తర్వాత 72 గంటల వరకూ ఎలాంటి షాంపూలను వాడకూడదని నిపుణులు అంటున్నారు. ఒకవేళ, షాంపూతో స్నానం చేయాలని అనుకుంటే సల్ఫేట్ లేని షాంపూని మాత్రమే ఉపయోగించాలంటున్నారు.
- మీరు వేడి నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టుకు వేసుకున్న రంగు తొందరగా ఫేడ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, వేడి నీళ్లతో తలస్నానం చేయకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
- కొంత మంది జుట్టు అందంగా కనిపించాలని హెయిర్ స్ట్రెయిట్‌నర్‌లను ఉపయోగిస్తుంటారు. కానీ, జుట్టుకు రంగు వేసుకున్న వారు ఇలాంటి పనులను చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కూడా హెయిర్ కలర్ తొందరగా పోతుందని అంటున్నారు.
- అలాగే హెయిర్ డ్రయ్యర్స్, కర్లింగ్ ఐరన్ మెషిన్లను కూడా ఉపయోగించకూడదంటున్నారు.
- జుట్టుకు రంగు వేసుకున్న వారు అది ఎక్కువ రోజులు ఉండటానికి, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు క్యాప్ లేదా స్కార్ఫ్‌ను ధరించమని సూచిస్తున్నారు. దీనివల్ల కలర్ తొందరగా కలర్ ఫేడ్ కాకుండా ఉంటుంది.
- హెయర్‌కు కలర్ వేసుకున్న తర్వాత కండిషనర్‌తో జుట్టును లోతుగా కండిషన్ చేయండి.