Does Sunscreen Stop Vitamin D Absorption : విటమిన్ డి లేదా 'సన్‌షైన్' విటమిన్ మన ఎముకలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని మనకు తెలుసు. అయితే ప్రతిరోజూ సన్‌స్క్రీన్ వాడటం విటమిన్ డి లోపానికి దారితీస్తుందని ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ పెట్టిన పోస్ట్ చాలామంది దృష్టిని ఆకర్షించింది. దీంతో సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ వాదన మొదలయ్యింది. అయితే ఇది కొత్తగా జరుగుతున్న చర్చ కాదు, ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు జరిగి మరుగున పడిపోయిన సమస్య.
ఫిల్టర్‌గా సన్‌స్క్రీన్ లోషన్
మనం సూర్యుని అతినీలలోహిత B రేడియేషన్ (UVB)కి గురైనప్పుడు, మన చర్మ కణాలలో కొన్ని ప్రక్రియలు జరిగి కొలెస్ట్రాల్ లాంటి అణువును విటమిన్ D3గా మారుస్తుంది. అంటే విటమిన్ డి ఉత్పత్తికి UVB రేడియేషన్‌కు గురికావడం అవసరం కాబట్టి, సన్‌స్క్రీన్ వాడకం విటమిన్ డి సంశ్లేషణను నిరోధిస్తుందని భావిస్తారు. ఎందుకంటే సన్‌స్క్రీన్ ఒక ఫిల్టర్‌గా పనిచేస్తుంది, సూర్యుని నుంచి వచ్చే UV రేడియేషన్‌ను ప్రతిబింబిస్తుంది. సన్ స్క్రీన్ లో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (SPF) ఎంత ఎక్కువగా ఉంటే, సన్‌బర్న్‌ను నివారించడంలో అది ఇది మెరుగ్గా పనిచేస్తుంది.
అంతే కాదు సన్ స్క్రీన్ రెడీయేషన్ ను ఆపి చర్మ కాన్సర్ ప్రభావం కూడా తగ్గిస్తుంది. అయినా నిజానికి సన్‌స్క్రీన్‌లు 100 శాతం ప్రభావవంతంగా ఉండవు, ఒకవేళ ఉన్నా చాలా మంది వాటిని నిర్దేశించిన విధంగా ఉపయోగించరు. రాసుకోవాల్సిన మొత్తం కంటే అతి తక్కువ మొత్తంలోనే రాసుకుంటారు. అంటే కాదు చాలామంది సూచించిన విధంగా ఈ సన్ స్క్రీన్‌ను మరి కొన్ని గంటల తరువాత రెండోసారి కూడా రాయరు. దీనిని బట్టి కొన్ని UVB ఇప్పటికే చర్మం యొక్క ఉపరితలాన్ని చేరుకొని ఉంటుంది.