Fruits To Avoid At Night :హెల్దీగా ఉండటానికి పండ్లను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇందులో ఉండే విటమిన్‌లు, ఖనిజాలు మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని అంటుంటారు. అయితే, అన్ని రకాల పండ్లుఆరోగ్యానికి మంచివే అయినా.. కొన్నింటిని రాత్రిపూట తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ నైట్ తినకూడని పండ్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
పైనాపిల్ :పైనాపిల్ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని నైట్ టైమ్‌లో తినడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
మామిడి పండ్లు :చక్కెర స్థాయులు అధికంగా ఉండే పండ్లలో మామిడి ఒకటి. వీటిని నైట్ పడుకునే ముందు తినడం వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మామిడి పండ్లను పగటి పూట తినడమే మంచిదంటున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు తినాల్సిన బెస్ట్ సలాడ్స్ ఇవే - ప్రిపరేషన్ వెరీ ఈజీ - రుచి సూపర్‌గా ఉంటుంది!
సిట్రస్ పండ్లు :కొంతమంది రాత్రి భోజనం చేసిన తర్వాత నిమ్మ, నారింజ లేదా బత్తాయి వంటి పండ్లను తింటుంటారు. కానీ, ఇలా సిట్రస్ పండ్లను తినడం వల్ల కొందరిలో గుండెల్లోమంటగా అనిపించి సరిగ్గా నిద్రపట్టకపోవచ్చని నిపుణులంటున్నారు. కాబట్టి, వీటికి దూరంగా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు.
ద్రాక్ష :ద్రాక్ష పండ్లలో సహజ సిద్ధంగా చక్కెర స్థాయిలుఎక్కువగా ఉంటాయి. వీటిని రాత్రి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
అరటిపండ్లు :ఈ పండ్లలో కూడా షుగర్ ఎక్కువగా ఉంటుందట. వీటిని నైట్ టైమ్‌లో తినకుండా పగలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాత్రి సమయంలో అరటి పండు తినడం వల్ల త్వరగా నిద్ర పట్టదని చెబుతున్నారు. 2010లో "ప్లోస్ వన్" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రాత్రి పూట అరటి పండు తినడం వల్ల నిద్రలేమిని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ హెల్త్ స్కూల్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ సైన్స్‌లో డైరెక్టర్ డాక్టర్ డేవిడ్ జె. స్టెయిన్‌మెట్జ్, PhD పాల్గొన్నారు.