తెలంగాణ

telangana

ETV Bharat / health

ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే టోటల్ సెట్! - Digestion Problem Solution

Digestion Problem Solution : చాలా మంది అజీర్తి సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా మనలో చాలామందికి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అవస్థలు పడుతుంటారు. అసలు ఈ సమస్యకు కారణంమ ఏమిటి? జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పని చేయడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Digestion Problem Solution
Digestion Problem Solution

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 7:46 AM IST

Digestion Problem Solution: తిన్న ఆహారం జీర్ణం అవడం అనేది ఎంతో ముఖ్యం. తీసుకున్న ఆహారం ద్వారానే మన శరీరానికి శక్తి లభిస్తుంది. అలాంటి ఆహారం జీర్ణం కాకపోతే శక్తి లభించదు. పైగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకోసమే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేసేలా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతుంటారు. ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? నివారణ మార్గాలేంటో తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు ఎందుకు వస్తాయి?
మన శరీరంలో అనేక సూక్ష్మజీవులు ఉంటాయి. కొన్ని మన ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ సూక్ష్మజీవుల సంఖ్య ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉంటుందో అప్పుడు తీసుకున్న ఆహారం జీర్ణం అవడంలో సమస్య తలెత్తుతుంది. అందుకే మన శరీరంలో మనకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్యను సరిగ్గా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

సూక్ష్మజీవులు తగ్గడానికి కారణాలు
మన శరీరంలో మేలు చేసే సూక్షజీవులు సంఖ్య తగ్గడానికి కారణం మనం తీసుకునే ఆహారం కావచ్చు. లేదంటే నిద్ర, ఒత్తిడి లాంటి అనేక కారణాలు కూడా ఉండొచ్చు అని వైద్యులు అంటున్నారు. అధిక చక్కెర శాతం కలిగిన ఆహారలను ఎక్కువగా తీసుకోకూడదు. దీని వల్ల ఈ బాక్టీరీయాల సంఖ్య తగ్గడం మొదలవుతుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే రెడ్ మీట్ తీసుకుంటే కూడా ఇలానే జరుగుతుంది.

ఫైబర్ ఉండేలా చూసుకోవాలి
శరీరానికి కావాల్సిన స్థాయిలో ఫైబర్ అందితే సూక్మజీవులకు విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. అందుకే హెల్తీ ఫైబర్ ఉండే బ్రోకలి, స్పీనచ్, తోటకూర వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. వీటితో పాటు కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది. తీసుకునే ఆహారంలో తృణ ధాన్యాలు, గింజలు ఉండేలా చూసుకుంటే ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ఫలితంగా జీర్ణ సమస్యలు తలెత్తవు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
ఫ్రైడ్ లేదా గ్రిల్ ఫుడ్స్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. రోజూ నీరు తాగాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. జీర్ణ సమస్యలు దూరంగా ఉంచడానికి ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. అలాగే మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. అన్నింటికి మించి ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇందుకోసం మంచి నిద్ర ఎంతో అవసరం. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర మనకు అనేక అనారోగ్య సమస్యల నుండి రక్షణగా పని చేస్తుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పచ్చి కూరగాయలు తింటే ఎన్నో హెల్త్​ బెనిఫిట్స్- కానీ ఉప్పు నీళ్లలో కడగకపోతే డేంజరే!

మహిళల్లో బ్యాక్​ పెయిన్​ ఎందుకొస్తుంది? ఎలా రిలీఫ్‌ పొందాలి?

ABOUT THE AUTHOR

...view details