Diabetics Can Consume Alcohol?:డయాబెటిస్(Diabetes) ఉన్నవారు రోజూ మందులు వాడాల్సిందే. ముఖ్యంగా.. ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారించాలి. కొన్ని ఆహారాలకు, పానీయాలకు దూరంగా ఉండాలి. మరి.. మద్యం తాగొచ్చా? అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. ఒకవేళ తాగితే ఏమవుతుంది? మద్యం తాగాక మందులు వేసుకోవచ్చా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగొచ్చా?..ఈరోజుల్లో ఎంతో మందికి మద్యం తాగే అలవాటు ఉంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. మందు తాగడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇక అదే మధుమేహం ఉన్నవారు మద్యం తాగితే మరికొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి డయాబెటిస్తో బాధపడుతున్నవారు వీలైనంత వరకు మద్యం తాగకపోవడమే మంచిది. ఎందుకంటే.. మద్యం తాగడం వల్ల నాడులు దెబ్బతింటాయి. మధుమేహులకు నార్మల్గానే నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువ. ఎంత ఎక్కువకాలం నుంచి డయాబెటిస్తో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదం ఉంది.
దీని కారణంగానే చాలామంది కాళ్లు చేతుల తిమ్మిర్లు, మంట పెట్టటం, సూదులతో పొడిచినట్టు అనిపించటం వంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. దీనికి మద్యం కూడా తోడైతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇంకాస్త త్వరగా నాడులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాళ్లు మొద్దుబారి, పుండ్లు పడొచ్చు. పుండ్లు మానకపోతే వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణలు. ఇవేకాకుండా ఇంకొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవేంటంటే..
డయాబెటిస్తో ఇబ్బందిపడుతున్నారా? - ఈ యోగాసనాలతో ఫుల్ బెనిఫిట్!