Delivery Without Pains : బిడ్డకు జన్మనివ్వడం అనేది ఆడవాళ్ల కల. తమ బిడ్డలకు జీవితాన్ని ప్రసాదించాలనుకునే తల్లిదండ్రులు సుఖ ప్రసవం కోసం చూస్తుంటారు. పూర్వకాలంలో పురిటినొప్పులు భరించే శక్తి, సామర్థ్యం చాలామందిలో ఉండేవి. కానీ మారిన కాలానికి అనుగుణంగా ప్రస్తుతకాలంలో చాలామంది ఆడవాళ్లు ప్రసవం సమయంలో వచ్చే నొప్పులను భరించలేకపోతున్నారు.
దీంతో తమకు నొప్పిని భరించే శక్తి లేదని, కానీ ప్రసవం తొందరగా చెయ్యమని వైద్యులను చాలామంది గర్భిణీలు కోరుతుంటారు. అయితే మారిన టెక్నాలజీ, పరిస్థితులు ప్రసవాన్ని కూడా మార్చేశాయి. ఇందులో భాగంగా కొత్తగా పురిటినొప్పులు లేని ప్రసవం అనేది ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.
పురిటినొప్పులు లేని ప్రసవం అంటే ఏమిటి?
What Is Painless Delivery :ఆడవాళ్లు ప్రసవించే సమయంలో గర్భసంచి నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు భరించలేని నొప్పి, బాధ కలుగుతాయి. అయితే ఈ బాధ, నొప్పిని తగ్గించడానికి వైద్యులు రకరకాల పద్ధతులను వాడుతుంటారు. దీని ఫలితంగా శిశువుకు జన్మనిచ్చే తల్లికి నొప్పి చాలా వరకు తెలియదు. సాధారణ పురిటినొప్పుల కంటే ఈ రకమైన ప్రసవంలో 80 నుంచి 90శాతం వరకు పురిటినొప్పుల బాధే ఉండదు. వీటినే నో పెయిన్ డెలివరీలు అంటారు.
నో పెయిన్ డెలివరీ రకాలు
Painless Delivery Types : సాధారణంగా నో పెయిన్ డెలివరీలో నాలుగు రకాల పద్ధతులను వైద్యులు వినియోగిస్తుంటారు. నైట్రస్ ఆక్సైడ్ లాంటి గ్యాస్‌ను ప్రసవ సమయంలో తల్లికి అందుబాటులో ఉంచే పద్ధతి ద్వారా పురిటి నొప్పుల బాధ తెలియకుండా ప్రసవాన్ని సులువుగా పూర్తి చేయవచ్చు. గర్భిణీకి నొప్పులు వస్తున్నాయనుకున్నప్పుడు ఆమెకు ఈ గ్యాస్‌ను అందిస్తారు. దీనిని పీల్చడం ద్వారా ఆమె నొప్పి లేకుండా బిడ్డను కనవచ్చు.