Conjuctivities Causes And Symptoms :విహార యాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు చాలా మంది వేసవి సెలవుల కోసం ఎదురు చూస్తుంటారు. సెలవులు అలా వచ్చాయో లేదా ఇలా ప్రయాణాలు మొదలు పెట్టేస్తారు. అలా బయట తిరగాలంటే ఓ వైపు ఎండ వేధిస్తుంటే మరో వైపు కండ్లకలకలు భయపెడుతున్నాయి. వేసవి కాలంలో చాలా మంది కండ్లకలక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. దీన్నే "పింక్ ఐ" అని కూడా పిలుస్తారు. మీ సమ్మర్ హాలిడేస్ సరదాలను ఇది అడ్డుగా రాకుండా ఉండాలంటే, దీని కారణాలు, లక్షణాలతో పాటు నివారణ చర్యలు కూడా తెలుసుకుంటే మంచిది.
కండ్లకలకలు ఎందుకు వస్తాయి?
సాధారణంగా కండ్లకలక అనేది వైరస్, బ్యాక్టీరియా, ఎలర్జీ కారకాల ద్వారా వస్తుంది. ముఖ్యంగా వేసవిలో పుప్పొడి, అచ్చు వంటి ఎలర్జీ కారకాలు ఎక్కువగా బయట పడతాయి. వేడి వాతావరణం కారణంగా ఇవి మరింత పెరిగి కంటి ఎలర్జీలకు కారణమవుతాయి. ఫలితంగా కండ్లకలక ఎర్రగా మారడం, వాపు, మంట వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వేసవిలో వేడిలో బయట ఎక్కువ సమయం ఉండటం, ఇతరులతో ఎక్కువ సన్నిహితంగా గడపడం వల్ల వైరస్, బ్యాక్టీరియా రూపంలో కండ్ల కలక వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్లు, బీచ్‌లు కండ్లకలక వ్యాప్తిని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- కండ్లకలక లక్షణాలు
వ్యాధిగ్రస్థుల కళ్లు ఎరుపెక్కి, నీరు కారుతూ ఉంటాయి. - కంటిరెప్పలు ఉబ్బడం.
- కళ్ళలో మంట, నొప్పి, కొద్దిపాటి దురద ఉంటాయి. వెలుతురు చూడటం కష్టం అవుతుంది.
కండ్లకలక రకాలు:
1. వైరల్ కండ్లకలక:
ఇది చాలా సాధారణ కండ్లకలకగా చెప్పచ్చు. చికిత్స చేయకుండానే రెండు వారాల్లో ఇది తగ్గిపోతుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఒక క్లాత్‌ను తడిపి కళ్లపై ఉంచుకుంటూ ఉండాలి. రోజు మొత్తం మీద నాలుగైదుసార్లు ఇలా చేయచ్చు.