Coconut Or Lemon Water Which Gives Better Hydration:రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లినవారు ఎండవేడి, ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు కూల్‌డ్రింక్స్, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, చెరుకు రసం, జ్యూసులు వంటి పానీయాలను తాగుతున్నారు. అయితే చాలా మందికి కొబ్బరి నీళ్లు, లెమన్ వాటర్.. ఈ రెండింటిలో బెస్ట్ డ్రింక్ ఏంటి? బాడీని హైడ్రేట్‌గా ఉంచడంలో ఏ డ్రింక్ ఉపయోగపడుతుంది? అనే డౌట్స్ వస్తాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
కొబ్బరినీళ్లు :సమ్మర్‌లో ఎండవేడి, ఉక్కపోత కారణంగా చెమట ఎక్కువగా వస్తుంది. దీనివల్ల చాలా మంది డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. అయితే, సమ్మర్‌లో డైలీ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మన శరీరానికి అవసరమైన పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లను పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఎలక్ట్రోలైట్లు మనకు తక్షణ శక్తిని అందిస్తాయని తెలియజేస్తున్నారు. అలాగే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని తెలియజేస్తున్నారు. కొబ్బరి నీళ్లలో మన శరీరానికిఅవసరమైన విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా కొబ్బరి నీళ్లలో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ వాటర్ బెస్ట్ అంటున్నారు నిపుణులు.
సమ్మర్‌లో ఈ పదార్థాలు అస్సలు తినకండి - తీవ్ర అనారోగ్య సమస్యలు గ్యారెంటీ!
2018లో "జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, వ్యాయామం చేసేవారు మంచినీళ్లను తాగడం కంటే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను తక్కువగా ఎదుర్కొన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో టెక్సాస్ విశ్వవిద్యాలయంలోని డాక్టర్. డేవిడ్ గ్రాబ్ పాల్గొన్నారు. డైలీ వ్యాయామం చేసేవారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను తక్కువగా ఎదుర్కొంటారని ఆయన పేర్కొన్నారు.