తెలంగాణ

telangana

ETV Bharat / health

మీ డైట్​లో ఈ చట్నీలు చేర్చుకోండి - హాయిగా తింటూ కొలెస్ట్రాల్ కరిగించుకోండి!

Cholesterol Free Chutneys: మీరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? పొట్ట చుట్టూ పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఆందోళన కలిగిస్తోందా? అయితే.. మీ డైట్​లో ఈ చట్నీలను చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Cholesterol
Cholesterol Free Chutneys

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 6:24 PM IST

Cholesterol Control Chutneys:మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది విపరీతంగా బరువు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పొట్ట చుట్టూ కొవ్వు(Cholesterol)పేరుకుపోతుంటుంది. దీంతో ఎలాగైనా దానిని కరిగించాలని తీవ్రమైన కసరత్తులు చేస్తుంటారు. కొందరైతే తినే ఆహారాన్ని తగ్గిస్తుంటారు. అలాకాకుండా ఆరోగ్యకరంగా మీరు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించుకోవచ్చు తెలుసా? అందుకోసం మీరు చేయాల్సిందల్లా మేము చెప్పే చట్నీలను మీ డైట్​లో చేర్చుకోవడమే! ఇంతకీ ఆ పచ్చళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

టమాటా చట్నీ :టమాటా చట్నీ టేస్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే.. అద్భుతమైన రుచితోపాటు కొవ్వును కూడా కరిగిస్తుందట. వీటిలో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. చట్నీ చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలతోపాటు చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకున్నారంటే మరిన్నీ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం.

కొత్తిమీర, పుదీనా చట్నీ : ఈ పచ్చడి కూడా బాడీలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనం ఏదైనా నాన్​వెజ్ వంటకాలు, బిర్యానీ లాంటివి వండినప్పుడు వీటిని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. కానీ, అలాకాకుండా మీరు కొత్తిమీర, పుదీనా చట్నీని మీ డైట్​లో చేర్చుకున్నారంటే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని మీరు అన్నం, చపాతీలలోనే కాదు పకోడాలు లేదా కచోరితో కలిపి తిన్నా రుచి అదిరిపోతుంది.

వెల్లుల్లి, నిమ్మకాయ చట్నీ : మీరు అధిక కొలెస్ట్రాల్​తో బాధపడుతున్నట్లయితే దానిని తగ్గించడంలో ఈ చట్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ పదార్థంలో కొలెస్ట్రాల్​ను నియంత్రించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నిమ్మకాయను తీసుకోవడం ద్వారా విటమిన్ సి మీ బాడీకి లభిస్తుంది. అయితే మీరు వెల్లుల్లిని వేయించి లేదా పచ్చిగాను చట్నీ కోసం యూజ్ చేయవచ్చు. ఇక ఈ చట్నీని బ్రెడ్ లేదా మీకు నచ్చిన వంటకాలతో హాయిగా తినేయొచ్చు.

పొట్ట కొవ్వు కరిగించాలా? ఈ 5 సింపుల్​ ఆసనాలు ట్రై చేయండి!

అల్లం, చింతపండు చట్నీ : ఈ పచ్చడి తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. అల్లంలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, చింతపండులో ఉండే విటమిన్ సి బాడీకి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈ చట్నీ చాలా బాగా సహాయపడుతుంది. ఈ చట్నీ కోసం ముందుగా చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, కొన్ని మిరియాలు ఒక జార్​లోకి తీసుకొని నానబెట్టిన చింతపండు వేసుకొని చట్నీని తయారుచేసుకోవాలి. అంతే నోరూరించే రుచికరమైన పచ్చడి రెడీ.

పచ్చిమిర్చి, జీలకర్ర చట్నీ :దీనిని తరచుగా మీ డైట్​లో చేర్చుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా పచ్చి మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే పదార్ధం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, జీలకర్ర గింజలలో ఉండే ట్రైగ్లిజరైడ్ మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ హెల్తీ, స్పైసీ చట్నీని రైస్‌, చపాతీలు, ఇతర వంటకాలతో కలిపి తింటే ఆ రుచి అదిరిపోతుంది. ఇలా పైన చెప్పిన ఈ 5 రకాల చట్నీలను మీ డైట్​లో భాగం చేసుకున్నారంటే కొలెస్ట్రాల్ స్థాయులను ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

లంచ్​ బదులు ఈ సలాడ్​లు ట్రై చేస్తే - ఈజీగా బరువు తగ్గుతారు!

బరువు తగ్గడానికి వాకింగ్‌ చేస్తున్నారా? ఇలా చేస్తే మీ శ్రమ అంతా వృథా!

ABOUT THE AUTHOR

...view details