Child Dental Care Tips: అందమైన, ఆరోగ్యకరమైన దంతాలు పూర్తి ఆరోగ్యానికి చాలా అవసరమైనవి. ముఖ్యంగా పిల్లలు తినడం, మాట్లాడటంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. బలహీనమైన దంతాలు, అపరిశుభ్రమైన నోరు కారణంగా రకరకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు, క్యావిటీస్ వంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే దంతాలు ఊడిపోవడం, వాటి అరమరిక విషయంలోనూ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. నిజానికి బాల్యంలో క్యావిటీస్ అనేవి కామనే కానీ అవి వాళ్లతో పాటు పెరిగి పెద్దవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఆరోగ్యకమైన దంతాలు, నోటి పరిశుభ్రత కోసం కొన్ని పనులను మీ పిల్లలకు అలవాట్లు చేస్తే వారు జీవితకాలం హాయిగా తినడానికి, అందంగా నవ్వడానికి, కాన్ఫిడెంట్‌గా మాట్లాడటానికి సహాయనడతాయి. ఇందుకు తల్లిదండ్రులు చేయాల్సినవి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
చిగుళ్లను తుడవాలి
మీ బిడ్డకు దంతాలు రాకముందే అంటే శిశువుగా ఉన్నప్పటి నుంచే నోటిని శుభ్రం చేయడం మొదలు పెట్టండి. తినిపించిన తర్వాత ప్రతిసారి శిశువు చిగుళ్లను శుభ్రంగా కడిగి, మృదువైన తడి క్లాత్‌తో తుడవటం అలవాటు చేసుకోండి.
బ్రష్, పేస్టు విషయంలో
దంతాలు వచ్చిన తర్వాత అవి ఒకటి రెండైనా సరే వాటిని సున్నితమైన బ్రష్‌తో, తక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్‌తో శుభ్రం చేయాలి. పిల్లలకు బ్రష్ చేయించేందుకు పేస్టు కేవలం బియ్యం గింజ పరిమాణంలో తీసుకుంటే చాలు. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయించండి.
ఫ్లాసింగ్
పిల్లల నోటి ఆరోగ్యం బాగుండాలంటే బ్రష్ చేయించడం ఎంత అవసరమో ఫ్లాసింగ్ కూడా అంతే అవసరం. టూత్ బ్రష్ చేరుకోలేని దంతాల మధ్య కూడా శుభ్రం చేయడానికి ఫ్లాసింగ్ చేయడం చాలా ముఖ్యం. ఇది దంతాల మధ్య ఉన్న ఆహార పదార్థాలు వంటి వాటిని తొలగిస్తుంది. ఫ్లాసింగ్ అలవాటు చిగురు వాపు, పీరియాంటీస్ వంటి వివిధ చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది.