తెలంగాణ

telangana

ETV Bharat / health

చపాతీలు, ఓట్స్ తింటున్నారా? అయితే, మీకు ఈ వ్యాధులన్నీ వచ్చే ఛాన్స్ ఉందట! - CELIAC DISEASE SYMPTOMS TREATMENT

-గ్లూటెన్ అధికంగా ఉండే పదార్థాలు తినడం వల్లే వస్తుందట! -ముఖ్యంగా వీరికే సెలియాక్ వ్యాధి వచ్చే అవకాశం

Celiac Disease Symptoms Treatment
Celiac Disease Symptoms Treatment (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Nov 11, 2024, 1:29 PM IST

Celiac Disease Symptoms Treatment:మీరు రోజు చపాతీలు తింటున్నారా? బార్లీ, ఓట్స్ మీ డైట్​లో ఉన్నాయా? అయితే మీకు ఈ వ్యాధి వచ్చే ఛాన్స్ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. గ్లూటెన్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల సెలియాక్ అనే వ్యాధి వ్యాపిస్తుందని.. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ అని అంటున్నారు. చాలా మంది సెలియాక్ వ్యాధి వస్తే కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, డయేరియా లాంటి లక్షణాలు కనిపిస్తాయని భావిస్తుంటారు. కానీ ఇలాంటి లక్షణాలు లేకుండానే చాలా మందిలో ఈ వ్యాధి వచ్చినట్లు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ Ciaran Kelly (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెలియాక్ వ్యాధి ఎవరికి ఎక్కువగా వస్తుంది? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలేంటీ డిజార్డర్‌?
సెలియాక్ వ్యాధి అనేది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. ఇది మన శరీరాన్ని కాపాడాల్సిన రోగనిరోధక శక్తి తిరిగి మన శరీరం పైనే దాడి చేసే పరిస్థితి. ఈ సమస్య ఉన్న వారు గోధుమలు, ఓట్స్‌, బార్లీ.. వంటి గ్లూటెన్‌ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వస్తుందని తెలిపారు. దీని వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. తద్వారా అలసట, నీరసం, బరువు తగ్గడం/పెరగడం, కడుపుబ్బరం, వాంతులు, మలబద్ధకం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు.

ఎవరిలో ఎక్కువ వస్తుంది?
చిన్న వయసులోనే సెలియాక్ వ్యాధి వస్తుందని చాలా మంది అనుకుంటారు. పిల్లలు గ్లూటెన్ ఆహారం తీసుకునే సమయంలో పెరిగే సెలియాక్ వ్యాధి లేట్ వయసులో బయట పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ సెలియాక్ అసోషియేషన్ ప్రకారం 46-56ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని తెలిపారు. ఇంకా 25శాతం మంది రోగుల్లో ఈ వయసు 60దాటిందని వివరించారు. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్, థైరాయిడ్ సమస్య ఉన్న మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలినట్లు పేర్కొన్నారు.

సెలియాక్ వ్యాధి కేవలం జీర్ణవ్యవస్థపైనే ప్రభావం చూపిస్తుందా?
ఈ వ్యాధి రోగ నిరోధక శక్తిపై దాడి చేస్తుందని.. దీంతో పాటు జీర్ణ వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఇలా కేవలం జీర్ణ వ్యవస్థపైనే కాకుండా నాడీ, ఎండోక్రైన్, అస్థిపంజర వ్యవస్థలపైనా ప్రభావం చూపుతుందని వివరించారు. ఫలితంగా మెదడు సంబంధిత సమస్యలు, మహిళల్లో రుతుక్రమ మార్పులు, కండరాలు, కీళ్ల నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

గ్లూటెన్ తీసుకుంటే సెలియాక్ వ్యాధి వచ్చినట్లేనా?
గ్లూటెన్ ఉండే పదార్థాలు తీసుకోగానే అనారోగ్యానికి గురైతే వెంటనే మనకు సెలియాక్ వ్యాధి సోకిందని అనుకుంటాం. కానీ అన్ని సమయాల్లో ఇలా జరగదని.. కొందరిలో నాన్ సెలియాక్ గ్లూటెన్ సెన్సిటివిటీ వస్తుందని అంటున్నారు. ఫలితంగా గ్లూటెన్ పెరిగి జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సెలియాక్ వ్యాధి నుంచి ఉపశమనం పొందేందుకు గ్లూటెన్‌ ఉన్న ఆహార పదార్థాల్ని మన డైట్​లో నుంచి పూర్తిగా తొలగించడమొక్కటే మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆహార పదార్థాలు కొనేటప్పుడు గ్లూటెన్‌-ఫ్రీ లేబుల్‌ ఉన్న వాటినే కొనాలని సలహా ఇస్తున్నారు. దీంతోపాటు తాజా మాంసం, కోడిగుడ్లు, పండ్లు-కాయగూరలు, పాలు-పాల పదార్థాలు, బీన్స్‌, పప్పులు, మొక్కజొన్న, క్వినోవా, బియ్యం.. వంటి గ్లూటెన్‌ లేని ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

ముఖ్య గమనిక :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

భోజనానికి ముందు నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే?

వ్యాయామం అంటేనే చిరాకు వస్తుందా? ఈ చిట్కాలు పాటిస్తే రోజూ ఈజీగా చేసేస్తారు!

ABOUT THE AUTHOR

...view details