Causes Of Hearing Loss: నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది వారికి తెలియకుండానే వినికిడి లోపానికి గురవుతున్నారు. ఒకప్పుడు ఈ సమస్య వృద్ధుల్లోనే కనిపించేది. కానీ, నేడు వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలా వినికిడి లోపం రావడానికి చాలా కారణాలున్నాయని నిపుణులంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ సేపు ఇయర్ ఫోన్‌లను ఉపయోగించడం, సౌండ్ ఎక్కువగా పెట్టుకొని టీవీ చూడటం వంటివి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయంటున్నారు. అసలు ఆ కారణాలు ఏంటి..? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం వినికిడి సామర్థ్యం కోల్పోవడానికి గల కారణాలు ఏంటి ?
- ఎక్కువ సౌండ్ చేసే బైక్‌లను రైడ్ చేయడం ద్వారా చెవి వినికిడి సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఈ బైక్‌లు విడుదల చేసే శబ్దాలు సుమారు 80 నుంచి 100 డెసిబుల్స్ ఉంటాయి.
- నైట్ టైమ్‌లో థియెటర్‌లో సినిమా చూడటం వల్ల.. అక్కడ వచ్చే సౌండ్ మన చెవులను దెబ్బతినేలా చేస్తుంది.
- ఈ రోజుల్లో చాలా మంది చేతిలో ఫోన్, చెవిలో ఇయర్‌బడ్స్ లేదా హెడ్‌సెట్ వంటివి పెట్టుకుంటున్నారు. వీటిని ఎక్కువ సేపు వాడటం వల్ల కూడా చెవులు వినికిడి సామర్థ్యాన్ని కోల్పోతాయి.
- క్రికెట్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్‌లలో తరచూ పాల్గొంటే కూడా వినికిడి లోపం రావచ్చు.
- ఫైర్ ఇంజిన్, అంబులెన్స్ వంటి వాహనాలు చేసే సైరన్‌లు కూడా చెవులను మోతమోగేలా చేస్తాయి. ఈ సైరన్ 110 నుంచి 129 డెసిబుల్స్ వరకు సౌండ్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- ట్రాఫిక్‌లో వచ్చే సౌండ్ కూడా చెవులపై ప్రభావం చూపిస్తుంది. ఇది వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుందట.
- క్రాకర్స్ వల్ల వచ్చే సౌండ్ కూడా చెవులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం క్రాకర్స్ కాల్చినప్పుడు 140 నుంచి 160 డెసిబుల్స్ వరకు సౌండ్ ఉత్పత్తి అవుతుంది.
- లాన్ మూవర్స్ నుంచి విడుదలయ్యే శబ్దాలు.. మన చెవులపై ప్రభావం చూపిస్తాయి.
- కార్పెంటర్ వర్క్ చేసే వారు 90 నుంచి 112 డెసిబుల్స్ వరకు సౌండ్ ఉండే వాతావరణంలో పని చేస్తారు. ఈ వాతావరణం చెవులపై ఎఫెక్ట్ చూపిస్తుంది.
- కీమోథెరపీలో ఉపయోగించే కొన్ని రకాల మందులు అలాగే, యాంటీబయాటిక్ జెంటామిసిన్ వంటివి చెవులు వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తాయి.
- మెనింజైటిస్ వంటి కొన్ని రకాల అనారోగ్యాల బారిన పడిన వారు కూడా వినికిడి శక్తినికోల్పోతారు..
వినికిడి లోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?
- కొంతమంది ఒత్తిడి, ఆందోళన వంటి వివిద కారణాల వల్ల గట్టిగా అరుస్తారు. ఇలా చేయడం వల్ల చెవులు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- వీలైనంత వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే వాతావరణంలో ఉండకుండా చూసుకోవాలి.
- ఎక్కువగా సౌండ్ ఉండే ప్రదేశంలో పని చేయాల్సి వస్తే చెవులకు ఇయర్ ప్లగ్స్, ఇయర్ మఫ్స్ వంటి వాటిని ధరించడం మంచిది. వీటివల్ల 15 నుంచి 30 డెసిబుల్స్ వరకు శబ్దాలను తగ్గించుకోవచ్చు.
- ఇంట్లో టీవీ, హోమ్ థియేటర్ వంటి పరికరాలను కొంచెం తక్కువ సౌండ్‌లో పెట్టుకోవాలి.
- ఎల్లప్పుడూ చెవులు పరిశుభ్రంగా ఉండేలా శుభ్రం చేసుకోండి.
- మీకు మ్యూజిక్ వినే అలవాటు ఉంటే రోజుకు 60 నిమిషాలు 60 శాతం వాల్యూమ్ పెట్టుకుని వినేలా చూసుకోవాలి. ఉదాహరణకు 100 డెసిబుల్స్‌తో సుమారు రెండు గంటలు మ్యూజిక్‌ను వింటే, మీ చెవులు సాధారణ స్థితికి రావడానికి కనీసం 16 గంటలు పడుతుంది. కాబట్టి, హెడ్‌ఫోన్ వంటి వాడకాన్ని వీలైనంత తగ్గించుకోండి.