Causes Of Early Age Menstruation : ఆడ పిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ కావడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ఆహారం ప్రధాన కారణమని అంటున్నారు. ముఖ్యంగా.. పిజ్జా, బర్గర్, చిప్స్, డోనట్స్ వంటి జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ పుడ్స్ తీసుకోవడం వల్ల.. వాటిలో అధికంగా ఉండే చక్కెర శాతం, అనారోగ్యకరమైన కొవ్వులు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తున్నాయని చెబుతున్నారు. ఈ దుష్ప్రభావాల ఫలితంగానే అమ్మాయిలు చిన్న వయసులోనే పీరియడ్స్ పొందుతున్నారని చెబుతున్నారు.
2016లో 'Journal of Adolescent Health'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినే అమ్మాయిలలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి కారణమవుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జాన్ స్మిత్ పాల్గొన్నారు. జంక్ ఫుడ్స్ అధికంగా తినడం వల్ల హార్మోన్స్‌పై ప్రభావం పడి చిన్న ఏజ్‌లోనే అమ్మాయిల్లో పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.
పీరియడ్స్ టైమ్‌లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? - ఈ విషయాలు తెలియకపోతే ఇబ్బందే!
అధిక బరువు : అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా కూడా పీరియడ్స్ త్వరగా రావచ్చని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. శరీరంలో అధిక కొవ్వు కణజాలం ఉండటం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయని, ఇవి చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి దారితీస్తాయంటున్నారు. ముఖ్యంగా తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక బరువు సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు.
జన్యువులు :అమ్మాయిల్లో చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి జన్యువులు కూడా ఒక కారణమని చెబుతున్నారు నిపుణులు. ఒక కుటుంబంలోని మహిళలకు.. అంటే తల్లి, మేనత్త.. ఇలా ఎవరికో ఒకరికి చిన్న వయసులోనే పీరియడ్స్ వస్తే.. అదే కుటుంబంలోని తర్వాతి తరం బాలికలలో కూడా చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉందంటున్నారు.