Health Benefits Of Boiled Food : ఆహారాన్ని తయారు చేయడంలో సులభమైన మార్గం ఉడకబెట్టడం. ఉడికించి వండటం వల్ల వంట త్వరగా అవడమే వేడి కారణంగా పోషక విలువలు అధికమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆహార పదార్థాలను ఉడికించడం వల్ల కీలక పోషకాలను సంరక్షిస్తాయి. హానికరమైన సూక్ష్మజీవులు ఏమైనా ఉంటే నాశనమై ఆరోగ్యకరమైన ఆహారంగా మారుతుంది. ఫలితంగా శరీరానికి కావలసిన పోషకాలు అందడం వల్లే పాటు జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. వీటితో పాటు ఆహర పదార్థాలను ఉడికించడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.
అరుగుదల సులభం
ప్రాసెస్ చేసిన, ప్రై చేసిన ఆహార పదార్థాలతో పోలిస్తే ఉడికించిన ఆహారాలు చాలా సులభంగా అరుగుతాయి. జీర్ణ సమస్యలు, కడుపులో ఇబ్బందులు వంటి వాటితో ఇబ్బంది పడుతున్న వారికి ఇవి చక్కటి ఎంపిక. ఉడికించడం వల్ల ఆహార పదార్థాలు మెత్తగా, సులభంగా మారి జీర్ణ వ్యవస్థపై భారం తగ్గుతుంది. తర్వగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
రుచి మెరుగవుతుంది
ఉడికించడం వల్ల ఆహార పదార్థాల స్వాభావిక రుచి మెరుగవుతుంది. వాటిలోని జిడ్డు, కొవ్వు పదార్థాలు తగ్గిపోయి లైట్ ఫుడ్‌గా మారుతుంది. చిన్న పిల్లలు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ఇవి చక్కటి ఆహారాలుగా పనిచేస్తాయి.
పోషకాలు బదిలం
సరైన పద్ధతిలో ఉడికిస్తే ఆహారంలోని పోషకాలు బయటకు పోకుండా ఉంటాయి. నీరు పోసి కప్పి ఉంచడం వల్ల విటమిన్లు, ఖనిజాలు ఆహారంలో ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంటాయి. సాధారణంగా వండటం వల్ల నీటిలో కరిగే విటమిన్-బీ, విటమిన్-సీ వంటి వాటిని కోల్పోతాం. ఉడికించడం వల్ల వాటిని సంరక్షించుకున్న వారిమవుతాం.