Contraceptive Pills Side Effects:పలు రకాల కారణాలతో మహిళలుగర్భ నిరోధక మాత్రలు వాడుతుంటారు. అయితే.. ఈ చిన్న మాత్రలు గర్భాన్ని నిరోధించినప్పటికీ.. శారీరకంగా, మానసికంగా అవి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. ఈ పిల్స్ వాడే ముందు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని అంటున్నారు. ఆ వివరాలు మీ కోసం..
ఈ పిల్స్ ఎలా పనిచేస్తాయి:సాధారణంగా మహిళల్లో నెలసరి వచ్చే సమయంలో అండాలు విడుదల అవుతాయి. వీటిని ఫలదీకరణం చెందించకుండా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్‌లో ఉన్న మిశ్రమాలు ఆపుతాయి. ఈ పిల్స్ గర్భాశయం చుట్టూ ఉన్న శ్లేష్మాన్ని చిక్కగా చేయడం ద్వారా.. స్పెర్మ్ గర్భాశయంలోకి ప్రవేశించడం, విడుదలైన అండాలను చేరుకోవడం కష్టతరం చేస్తుంది. పిల్ లోని హార్మోన్లు గర్భాశయ గోడలను అంటిపెట్టుకుని ఉండే అండాలను విచ్చిన్నం అయ్యేలా చేస్తాయి.
గర్భనిరోధక పిల్స్ యూజ్ చేసేమందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే:
వైద్యుడిని సంప్రదించడం:ప్రస్తుతం అన్ని ఫార్మసీలు 24/7 అందుబాటులో ఉండటంతో వైద్యుల సూచన లేకుండానే చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. కానీ.. ఇలా వాడడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఈ మాత్రల ప్రభావం వల్ల కొంతమంది మహిళల్లో కడుపు నొప్పి, పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, చలి జ్వరం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు వంటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఈ అలవాట్లు ఉన్న వారు కూడా:ఇప్పటికే ఊబకాయం, మధుమేహంతో బాధపడుతున్నవారు, స్మోకింగ్ అలవాటున్న మహిళలు గర్భనిరోధక మాత్రలను అస్సలు ఉపయోగించకూడదని అంటున్నారు. సంవత్సరాలకు పైగా వీటిని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పలు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయని చెబుతున్నారు. సంవత్సరాలలోపు గర్భనిరోధక మాత్రలు గర్భాశయం కంటే ఫెలోపియన్ను ప్రభావితం చేస్తాయని.. ఇది అంతర్గత రక్తస్రావం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.