Best Ways To Avoid Junk food For Child :పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే హెల్దీగా ఉంటారు. తీసుకునే ఆహారంలో పోషకాలు నిండుగా ఉండాలి. కానీ.. నేడు చాలా మంది పిల్లలు ఇంట్లో వండిన వాటి కన్నా బయట దొరికే జంక్ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ఫుడ్‌లో ఎటువంటి పోషకాలూ ఉండవు. అంతేకాదు.. ఇవి తినడం వల్ల పిల్లలకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. జంక్‌ఫుడ్ తినకుండా ఎలా మాన్పించాలో నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దూరంగా..
పిల్లలు తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడుస్తారు. వారు ఎటువంటి అభిరుచులను కలిగి ఉంటే.. అవే పిల్లలూ పాటిస్తారని నిపుణులంటున్నారు. అయితే.. తల్లిదండ్రులుగా మీరు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కాబట్టి.. మార్పు మీ నుంచే ప్రారంభం కావాలి. ఎలా అంటే.. బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్ ఇంట్లోకి తీసుకురాకుండా.. హోమ్ మేడ్ రెసిపీస్ తయారు చేయాలి.
వారికి తెలియజేయండి..
పిల్లలకు జంక్‌ఫుడ్ తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి అవగాహన ఉండదు. అప్పుడు తల్లిదండ్రులుగా మనం వారికి ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పాలి. ఏ ఆహార పదార్థాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి? అవి మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అనేది వారికి వివరించాలి. అర్థమయ్యేలా చెప్పాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
అందంగా అలంకరించండి..
సాయంత్రం పిల్లలు బయట దొరికే స్నాక్స్ తినకుండా ఉండటానికి.. ఇంట్లోనే క్యారెట్లు, బీట్‌రూట్, దోసకాయ ముక్కలతో అందంగా డిజైన్ చేసి ప్లేట్‌లో సర్వ్ చేయండి. దీనివల్ల ఆ ప్లేట్ వారిని ఆకర్షిస్తుంది. అప్పుడు మెల్లగా వాటిని తినడం ప్రారంభిస్తారు.