తెలంగాణ

telangana

ETV Bharat / health

వాటర్ బాటిల్స్ క్లీన్​​ చేయడం కష్టంగా ఉందా? ఈ టిప్స్​ పాటిస్తే చాలా ఈజీ! - Water Bottles Effective Clean Tips

Water Bottles Cleaning Tips: ప్రస్తుతం చాలా మంది వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారు. అయితే కొంతమంది రోజుల తరబడి వాటిని క్లీన్ చేయకుండా ఉపయోగిస్తే.. ఇంకొందరు క్లీన్ చేసినా తూతూమంత్రంగా అలా నీళ్లలో ముంచి ఇలా తీస్తారు. ఫలితంగా లోపల మలినాలు పేరుకుపోయి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాకాకుండా ఈ టిప్స్ పాటించారంటే మీ వాటర్ బాటిల్స్ బయట, లోపల తళతళమెరవాల్సిందే!

Water Bottles
Water Bottles

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 9:58 AM IST

How To Clean Water Bottles from Inside:మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ తగినంత వాటర్ తాగడం ముఖ్యం. ఈ క్రమంలోనే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎక్కడికి వెళ్లినా వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా జిమ్, ఆఫీస్, దూరప్రయాణాలకు వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ కచ్చితంగా ఉండాల్సిందే. వీటిని యూజ్ చేయడం వరకు ఓకే కానీ, చాలా మంది వాటర్ బాటిల్స్ క్లీనింగ్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంటారు. ఇక కొందరు డైలీ వాటర్ బాటిల్స్(Water Bottles) శుభ్రం చేసినా ఏదో పైపైన కడుగుతుంటారు. ఇంకొందరైతే బాటిల్స్ మూతలు చిన్నగా ఉండడంతో వాటి బయట మాత్రమే క్లీన్ చేస్తుంటారు. లోపల మురికి అలాగే ఉండిపోతుంది. ఫలితంగా బాటిల్స్ లోపల బ్యాక్టీరియా వృద్ధి చెంది వివిధ అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరూ వాటర్ బాటిల్ క్లీనింగ్​ విషయంలో ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే ఇకపై అలాకాకుండా ఈ టిప్స్​తో ఈజీగా వాటర్​ బాటిల్ లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు. అందుకోసం ఎక్కువగా శ్రమించాల్సిన పనీ లేదు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గోరు వెచ్చని నీరు, డిష్ వాషింగ్ లిక్విడ్ :మీరు వాటర్ బాటిల్ క్లీనింగ్ కోసం ముందుగా అందులో గోరువెచ్చని నీటిని పోయాలి. ఆ తర్వాత దానిలో కొన్ని చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్ సోప్ వేయాలి. అనంతరం బాటిల్ క్యాప్ పెట్టి బాగా షేక్ చేసి 2 నుంచి 4 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత వాటర్​ బాటిల్​ను బ్రష్ సహాయంతో బాగా స్క్రబ్ చేయాలి. సీసా దిగువ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా చాలా మంది బాటిల్ మూతను నీట్​గా కడగరు. అలాకాకుండా దానిని కూడా బాగా స్క్రబ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు స్క్రబ్ చేసిన ఆ బాటిల్​ను ట్యాప్​ కింద రన్నింగ్ వాటర్​తో బాగా కడగాలి. ఆ తర్వాత దానిని తడి పోయేంత వరకు ఎండకు ఆరబెట్టాలి. ఇక మొత్తం తేమ పోయిందని అనిపించినప్పుడు క్యాప్ పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిని యూజ్ చేయాలి.

బ్లీచ్ కూల్ వాటర్ ప్రాసెస్ :ఇది కూడా వాటర్ బాటిల్ డీప్ క్లీనింగ్​కి చాలా బాగా యూజ్ అవుతుంది. బాటిల్​ నుంచి వాసనను తొలగించడానికి ఈ ప్రాసెస్ చాలా ఎఫెక్టివ్​గా పని చేస్తుంది. ఇందుకోసం మీరు ముందుగా బాటిల్​లో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఆ తర్వాత చల్లటి నీరు పోసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి బాగా షేక్ చేయాలి. ఆ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. ఆపై ఉదయం లేవగానే ఆ నీళ్లు పారబోసి బ్రష్​తో స్క్రబ్ చేసి ఫ్రెష్ వాటర్​తో శుభ్రంగా కడగాలి. అంతే మీ వాటిల్ బాటిల్ కొత్తదానిలా నీట్​గా కనిపిస్తుంది.

వెనిగర్​తో శుభ్రం చేసుకోండి : మీరు వెనిగర్​తోనూ వాటర్​ బాటిల్​ను క్లీన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా బాటిల్​లో అరకప్పు వెనిగర్, ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. ఆ తర్వాత అందులో కూల్ వాటర్ పోయండి. రాత్రంతా బాటిల్​ను అలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం లేచి ఓసారి బాటిల్ షేక్ చేసి ఆ వాటర్ బయట పారబోయండి. ఆ తర్వాత బాటిల్ బ్రష్​తో బాగా స్క్రబ్ చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి.

చూశారుగా ఈ టిప్స్ పాటించి.. మీ వాటర్ బాటిల్​ క్లీన్ చేసుకున్నారంటే అప్పుడే కొన్నదానిలా తళతళ మెరిసిపోవడం ఖాయం!

స్నానం చేసేటప్పుడు లూఫా వాడే అలవాటు ఉందా? - సమస్యలు తప్పవట!

అలర్ట్‌ : ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే స్ట్రెస్ పెరగడం ఖాయం!

ABOUT THE AUTHOR

...view details