ETV Bharat / state

గుట్టల మధ్య రూ.కోట్లు విలువ చేసే ధాన్యం - చూసి షాకైన అధికారులు! - CMR GRAIN SMUGGLING IN MAHABUBNAGAR

ప్రభుత్వం నుంచి పొందిన సీఎంఆర్‌ ధాన్యం అక్రమ రవాణా - విలువ రూ.20 కోట్లు పైమాటే- కేసు నమోదు చేసిన అధికారులు

CMR Grain Smuggling in Mahabubnagar
CMR Grain Smuggling in Mahabubnagar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

CMR Grain Smuggling in Mahabubnagar : ప్రభుత్వం నుంచి పొందిన సీఎంఆర్ ధాన్యాన్ని గుట్టల మధ్య దాచి దర్జాగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఓ మిల్లు యజమాని పట్టుబడిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలంలోని మిరాసిపల్లి శివారులో చోటుచేసుకుంది. కొత్తకోట మండలంలోని మిరాసిపల్లి శివారులోని ఇషాన్‌ ట్రేడర్స్‌ బియ్యం మిల్లుకు 2022-2023 సంవత్సరానికి సంబంధించిన వానాకాలం, యాసంగి సీజన్లకు 4.72 లక్షల బస్తాల సీఎంఆర్‌ ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ నుంచి కేటాయించారు. మిల్లు యాజమాన్యం పేరుకే కొంత ధాన్యం మర ఆడించి ప్రభుత్వానికి పంపించింది. అయితే మిల్లు వద్ద 2,52,162 బస్తాలు ఉండాల్సింది ఉండగా, కేవలం 18,375 ధాన్యం బస్తాలు మాత్రమే ఉన్నాయి.

కొరవడిన అధికారుల పర్యవేక్షణ : ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన తర్వాత ఆ ధాన్యాన్ని మిల్లు వద్ద లేదా గోదాముల్లో మాత్రమే భద్రపరుచుకోవాలి. ఇషాన్‌ ట్రేడర్స్ యజమాని మాత్రం అడవిలో గుట్టలో మధ్యలో నిల్వ చేసి, వాటిపై టార్పాలిన్‌ కవర్లు కప్పి ఉంచారు. రూ.కోట్ల విలువ గల సీఎంఆర్‌ ధాన్యాన్ని మిల్లుకు కేటాయించిన తర్వాత అధికారులు ఎప్పుడూ పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టల మధ్య దాచిన ధాన్యాన్ని వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారంలో ఈ నెల 20న అదనపు రెవెన్యూ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పౌర సరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథంతో కలిసి పరిశీలించారు. ఈ విషయంపై పూర్తి వివరాలను సేకరించాలని కొత్తకోట తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు ఆదేశించారు.

CMR Grain Smuggling in Mahabubnagar
మిరాసిపల్లి సమీపంలో గుట్ట వద్ద ధాన్యాన్ని పరిశీలిస్తున్న తహసిల్దార్‌ వెంకటేశ్వర్లు (ETV Bharat)

రూ.11.50 లక్షల 'రైతు బీమా' డబ్బులు స్వాహా - అమాయకపు రైతులను మోసం చేసిన ఏఈవో

ఉన్నతాధికారులకు నివేదిక : శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ నందకిశోర్‌, ఆర్‌ఐలు వాసు, రాములుతో కలిసి మిల్లుతో పాటు ధాన్యం నిల్వ చేసిన గుట్ట వద్దకు వెళ్లగా అప్పటికే అక్కడ ధాన్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాహనాలను గుర్తించారు. కొత్తకోట పోలీసులకు అప్పగించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అక్రమంగా తరలించిన ధాన్యం విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

'గుట్టల మధ్య నిల్వ చేసి అక్రమంగా తరలిస్తుండగా సమాచారం మేరకు పట్టుకున్నాం. పూర్తి వివరాలు రెవెన్యూ సిబ్బంది సేకరించారు. ఈ ధాన్యమంతా ప్రభుత్వం నుంచి కేటాయించిందే. ధాన్యం అక్రమంగా తరలించిన మిల్లు యజమాని మధుసూదన్‌రెడ్డిపై దొంగతనం కేసు నమోదు చేయించాం. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆస్తులు జప్తు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం.' అని వనపర్తి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

'మీకు ఇల్లు వచ్చింది - ఇదిగో పత్రాలు తీసుకోండి' - హైదరాబాద్​లో 'డబుల్​' మోసం

బతికుండగానే భర్తలను చంపేసి! - బీమా డబ్బుల కోసం మరీ ఇంత దారుణమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.