Best Healthy Snacks for Tours:ప్రయాణాలు చేయడం అంటే అందరికీ ఇష్టమే. సెలవులు దొరికేతే చాలు ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళ్తుంటారు. అందుకు తగ్గట్టుగా ముందే ప్లాన్ చేసుకుంటారు. అయితే, టూర్లకు వెళ్లేవారు ఆరోగ్యం, ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ప్రాంతాలకు వెళతాం కాబట్టి వెంట స్నాక్స్ తీసుకుని వెళ్లడం బెస్ట్. అయితే స్నాక్స్ అనగానే చాలా మంది వాళ్ల ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకెళ్తుంటారు. అందులో ఎక్కువగా ఆయిల్ ఫుడ్డు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అయితే జర్నీలో ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కడుపులో వికారంగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యం పాడవుతుంది. అందుకని ఆయిల్ ఫుడ్ బదులు ఆరోగ్యాన్ని అందించేవి తీసుకెళ్లమంటున్నారు పోషకాహార నిపుణులు. ఇలాంటి సందర్భాలకు సూపర్‌గా సరిపోయే స్నాక్స్‌ను వారు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
అరటి పళ్లు:బనానా.. సీజన్‌తో సంబంధం లేకుండా తక్కువ ధరలో సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉంటాయి. బ్యాగ్‌లో పెట్టుకుని ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లగలిగే అరటిపళ్లు టూర్లకు వెళ్లినప్పుడు బెస్ట్ స్నాక్స్. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినగానే అలసట దూరమై శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
యాపిల్, నారింజ:ఎంతో రుచిగా ఉండే యాపిల్, నారింజలు కూడా టూర్లకు తీసుకెళ్లడానికి బెస్ట్ స్నాక్స్. వీటిల్లో విటమిన్ సీ తోపాటూ ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సహా ఇతర పోషకాలు ఉంటాయి. వెంట తీసుకెళ్లడం కూడా సులువే.
ద్రాక్ష:ద్రాక్షపళ్ల రుచి అమోఘం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి, ల్యూటిన్ అండ్ జియాక్సంథిన్ అనే కెరోటినాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి పోషకాలు సూపర్‌గా ఉన్నాయి. పైగా వీటిని క్యారీ చేయడం కూడా సులువే. వీటని తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. కాబట్టి టూర్లకు వెళ్లినప్పుడు ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..
టూర్ వెళ్తే ఈ టిప్స్ పాటించాల్సిందే - లేదంటే జేబు ఖాళీ అయిపోతుంది!