Best Fruits For Hair Growth : ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవశైలి, పోషకాల్లేని ఆహారం, దుమ్ము, కాలుష్యం ఇలా మన జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతిసే కారకాలుగా ఉన్నాయి. దీనివల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా మారుతాయి. దీంతో జట్టు రాలిపోతుంది. జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుంది. అయితే జట్టు రాలడాన్ని నిరోధించేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల రసాయన ప్రొడక్ట్స్ వినియోగిస్తుంటారు. వీటిలోని కెమికల్స్ జుట్టు ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. ఫలితంగా జుట్టు మరింత రాలుతుంది. అయితే జుట్టుకు లోతైన పోషణ అందించేందుకు ఆహారంలో కూరగాయలు, పండ్లు చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జుట్టు వేగంగా పెరిగేలా సహాయపడే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
- జామ : జామలో విటమిన్ -సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. జామను నిత్యం డైట్లో చేర్చుకున్నట్లయితే మీ వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. జుట్టు రాలకుండా అడ్డుకుంటుంది. విటమిన్ -సి మాత్రమే కాదు జామలో విటమిన్ -ఎ కూడా ఉంటుంది. ఇది స్కాల్ప్ ఆరోగ్యానికి, సహజమైన జట్టు లూబ్రికేషన్ కోసం సెబమ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
- బొప్పాయి :బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ అధికమోతాదులో ఉన్నాయి. ఇవి మీ వెంట్రుకల కుదుళ్లకు పోషణనిస్తుంది. ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులోని పాపైన్ ఎంజైమ్ మీ తలపై ఉన్న మృత చర్మ కణాలను తొలగించి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
- స్ట్రాబెర్రీలు : స్ట్రాబెర్రీలు విటమిన్ సి, బయోటిన్, ఐరన్‌తో నిండి ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి కీలకమైనవి. విటమిన్- సి కొల్లాజెన్ ఉత్పత్తి చేస్తుంది. కెరాటిన్ సంశ్లేషణలో బయోటిన్ సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలను డైట్లో చేర్చుకుంటే ఐరన్ లోపం వల్ల జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.
- సిట్రస్ పండ్లు : నారింజ, ద్రాక్షపండ్లు, నిమ్మకాయల్లో విటమిన్ -సి పుష్కలంగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అదనంగా, ద్రాక్షపండ్లు విటమిన్ బి12ను అందిస్తాయి. బి12 జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
- బెర్రీలు :బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ యాంటీఆక్సిడెంట్‌లతో నిండి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌తో పోరాడుతాయి. మీ హెయిర్ ఫాలికల్స్‌ను రక్షించడంతోపాటు ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ను ప్రోత్సహిస్తాయి. జుట్టు ఆరోగ్యానికి విటమిన్ సి, ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తాయి.
- అరటి : పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లు స్కాల్ప్ హైడ్రేషన్‌ను నిర్వహించడంలో సహాయపడతాయి. జుట్టు పొడిబారకుండా రక్షిస్తుంది. అరటిని డైట్లో చేర్చుకుంటే విటమిన్ బి6 ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.
- సాల్మన్ : ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉన్న సాల్మన్ జుట్టు కుదుళ్లకు పోషణ అందించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఒమేగా-3లు కూడా తలపై మంటను తగ్గిస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టి చుండ్రును నివారిస్తుంది.
- బచ్చలికూర : బచ్చలికూరలో ఐరన్, విటమిన్ ఎ, సి, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. ఐరన్ లోపం జుట్టు రాలడానికి దారితీస్తుంది. మీ ఆహారంలో బచ్చలికూర వంటి ఐరన్-రిచ్ ఫుడ్‌లను చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
- గుడ్లు:గుడ్లు ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. ఇది జుట్టు పెరుగుదలలో కీలకం వ్యవహారిస్తుంది. ఎందుకంటే జుట్టు ప్రధానంగా ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి అవసరమైన బి విటమిన్ అయిన బయోటిన్ కూడా ఇందులో ఉంటుంది.
- చిలగడదుంపలు :బీటా కెరోటిన్‌తో నిండిన చిలగడదుంపలు శరీరంలో విటమిన్ ఎ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. విటమిన్ ఎ హెల్తీ స్కాల్ప్‌ను నిర్వహించడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నిత్యం ఈ పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకున్నట్లయితే జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ముఖ్య గమనిక :
ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.