తెలంగాణ

telangana

ETV Bharat / health

విటమిన్​ B12 లోపిస్తే చాలా డేంజర్ - ఈ ఫుడ్స్​ తినాలంటున్న నిపుణులు! - BEST FOODS TO VEGETARIANS FOR B12

-విటమిన్ బీ 12 డెఫీషియెన్సీతో ఎన్నో ఆరోగ్య సమస్యలు - ఈ ఫుడ్స్​ తీసుకుంటే మంచిదట!

Best Foods to vegetarians for Vitamin B12
Best Foods to vegetarians for Vitamin B12 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

Best Foods to vegetarians for Vitamin B12: మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో విటమిన్ B12 ముఖ్యమైనది. దీనిని 'కోబాలమిన్' అని కూడా పిలుస్తారు. మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడే ఈ విటమిన్​(B12)లోపిస్తే, రక్తహీనత నుంచి మతిమరుపు వరకు, నరాల బలహీనత నుంచి డిప్రెషన్‌ వరకు మనల్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా.. శాకాహారులు విటమిన్​ బి12 విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ క్రమంలోనే విటమిన్​బి12 కోసం తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

బి కాంప్లెక్స్‌ విటమిన్లు అన్నింటిలో బి12 చాలా ముఖ్యమైనదని, మెటబాలిజాన్ని నియంత్రించడానికీ, ఎర్రరక్తకణాల పనితీరు మెరుగుపరచడంలోనూ ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుందని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్​ లతాశశి చెబుతున్నారు. శాకాహారంలో బి12 చాలా తక్కువగా ఉంటుందని, సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కొంత మేలు జరుగుతుందని చెబుతున్నారు. అలాగే కొన్ని ఆహార పదార్థాల్లో కూడా విటమిన్​ బి 12 ఉంటుందని, వాటిని డైట్​లో చేర్చుకుంటే మంచిదంటున్నారు. అవేంటంటే,

పాల ఉత్పత్తులు :తగిన మొత్తంలో విటమిన్ B12 పొందడానికి పాల సంబంధిత ఉత్పత్తులు మంచి ఎంపికగా చెబుతున్నారు డాక్టర్​ లతాశశి. పాలు, జున్ను, పెరుగు, చీజ్​ వంటి డెయిరీ ఉత్పత్తుల్లో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుందంటున్నారు. కాబట్టి, మీ రోజువారీ ఆహారంలో వివిధ రకాల పాల ఉత్పత్తులను చేర్చుకోవడం మంచిదంటున్నారు.

తృణధాన్యాలు : తృణధాన్యాలు బలవర్థకమైన పోషకాలను అందించి శరీరానికి మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే నాన్​వెజ్ తినని వారు విటమిన్ బి12 సమృద్ధిగా పొందాలంటే తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే అంటున్నారు. ఒక కప్పు తృణధాన్యాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఓట్స్‌ ఫ్లేక్స్‌, కార్న్‌ఫ్లేక్స్‌ తీసుకోవటం మంచిదంటున్నారు.

పోషకాలున్న ఈస్ట్‌ :న్యూట్రిషనల్‌ ఈస్ట్‌లో కూడా విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుందంటున్నారు. ఈ ఈస్ట్‌ ఒక చెంచాలో 5 ఎమ్‌సీజీ విటమిన్‌ బి12 ఉంటుందని చెబుతున్నారు. ఈస్ట్‌ను పాప్‌కార్న్‌, సూపులు, కూరలు, పాస్తాలలో కలుపుకుని తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇవే కాకుండా బియ్యం, మొక్కజొన్న, ఓట్స్, సోయా, మల్టీగ్రెయిన్స్‌ లాంటి ఫోర్టిఫైడ్‌ ఆహారాన్నీ తీసుకోవాలని అంటున్నారు డాక్టర్​ లతాశశి.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'విటమిన్ బీ 12 లోపంతో రక్తహీనత సమస్య'- ఈ ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందట!

అలర్ట్ : తరచూ అలసటగా ఉంటూ తిమ్మిర్లు వస్తున్నాయా? - కారణం అదే కావొచ్చు!

ABOUT THE AUTHOR

...view details