Food Suggestions for Kids During Exams Time:ఎగ్జామ్స్ అంటే చాలు.. పిల్లలకు ఎక్కడ లేని టెన్షన్ మొదలవుతుంది. మార్కులు తక్కువగా వస్తాయేమోననే భయంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. ఇలా టెన్షన్ పడడం వల్ల లాభం ఉండకపోగా.. నష్టం ఎక్కువగా కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించడానికి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా.. మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలని కండిషన్లు పెట్టొద్దని చెబుతున్నారు. దాంతోపాటు వారికి మంచి పోషకాహారం అందించాలని సూచిస్తున్నారు.
నట్స్, సీడ్స్:వాల్ నట్స్, అవిసె గింజలు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు.. ఇలాంటి నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E ఉంటాయి. ఇవి జింక్‌ను కూడా అందిస్తాయి. వీటి ద్వారా పిల్లలు మానసికంగా చురుగ్గా ఉంటారు.
ఓట్స్:ఎగ్జామ్స్ టైమ్ లో పిల్లలకు ఓట్స్ కూడా బెస్ట్ ఫుడ్ అంటున్నారు నిపుణులు. ఓట్స్‌లో అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు ఉంటాయి. ఇవి శక్తిని నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి. కాబట్టి పిల్లలు రోజంతా చురుగ్గా ఉంటారు. అందుకే.. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌గా ఇస్తే మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి. తద్వారా పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఉంటారు.
పిల్లల్లో మెమరీ పవర్ పెరగాలా? - డైలీ ఈ యోగాసనాలు వేస్తే వారికి తిరుగుండదు!
ఆకుకూరలు:ఆకుకూరలు కూడా పిల్లలకు ఇవ్వాల్సిన ఫుడ్స్‌లో ఒకటని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను నిర్వహిస్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, పిల్లలు రోజంతా చురుగ్గా ఉండడంలో సహాయం చేస్తాయి.