తెలంగాణ

telangana

ETV Bharat / health

సమ్మర్​లో ఇవి తినండి - మీ చర్మం పాలరాయిలా మెరిసిపోతుంది! - Best Foods for a Glowing Skin - BEST FOODS FOR A GLOWING SKIN

Best Foods for a Glowing Skin : అందరూ చర్మం కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. నిగనిగలాడే చర్మం కోసం ఏవేవో క్రీమ్‌లు యూజ్ చేస్తుంటారు. అయితే.. అలాకాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ డైట్‌లో చేర్చుకుంటే.. కాంతివంతమైన చర్మం సొంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Glowing Skin Foods
Best Foods for a Glowing Skin (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 2:23 PM IST

Super Foods For A Glowing Skin :వేసవిలో తలెత్తే చర్మ సమస్యల నుంచి ముఖాన్ని కాపాడుకోవడానికి జనాలు ఏవేవో హోమ్ రెమిడీస్, చిట్కాలు ఫాలో అవుతుంటారు. ఇంకొందరైతే మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్​ అప్లై చేస్తుంటారు. కానీ.. స్కిన్ హెల్తీగా ఉండటానికి ఎక్స్​టర్నల్ కేర్​తోపాటు.. దానికి అవసరమైన పోషకాలు అందించడం ముఖ్యమనే విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. ఇందుకోసం మీ డైట్​లో ఈ ఐదు రకాల ఫుడ్స్ చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కీరదోస :వేసవిలో కీరదోస తీసుకోవడం వల్ల చర్మానికి కావాల్సిన కంటెంట్ అందుతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కీరదోసలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకు తోడ్పడతాయంటున్నారు నిపుణులు. కీరదోసతో పాటు పుచ్చకాయ వంటి హైడ్రేటింగ్ పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేటెడ్​గా ఉండడమే చర్మం ప్రకాశవంతంగా మెరవడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు.

పెరుగు :పెరుగులోని ప్రధాన పోషకాలలో ఒకటైన లాక్టిక్ యాసిడ్ అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కీలకంగా పనిచేస్తుందంటున్నారు. లాక్టిక్ యాసిడ్ ఒక మంచి ఎక్స్‌ఫోలియేట్, స్కిన్ మాయిశ్చరైజర్. అలాగే.. యాంటీ ఏజింగ్ ఏజెంట్​గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. పెరుగులో జింక్, విటమిన్లు B2, B5, B12 పుష్కలంగా ఉంటాయి. అందులో.. విటమిన్ B2 చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడడమే కాకుండా.. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మ కణాలను రక్షిస్తుందంటున్నారు నిపుణులు.

2022లో 'Plastic and Reconstructive Surgery Journal' అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం మొత్తం హైడ్రేషన్ స్థాయిని పెంచి స్కిన్​ను మరింత మృదువుగా చేయడంలో సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ జాన్ డో పెరుగును తీసుకోవడం వల్ల అందులో ఉండే పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చాలా బాగా సహాయడతాయని ఆయన పేర్కొన్నారు.

వేసవిలో స్కిన్‌ ప్రాబ్లమ్స్‌ వేధిస్తున్నాయా ? ఈ టిప్స్‌ పాటిస్తే అంతా సెట్​!

చిలగడదుంప :విటమిన్ ఎ అధికంగా ఉండే స్వీట్ పొటాటో కూడా చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. విటమిన్​ ఎ చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా మొటిమలు ఏర్పడడాన్ని తగ్గించి చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా మారుస్తుందంటున్నారు నిపుణులు. అలాగే దీనిలో ఉండే బీటా కెరోటిన్ వృద్ధాప్య చర్మానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్​తో పోరాడి చర్మానికి మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

క్వినోవా : దీనిలో అధికస్థాయిలో ఉండే రిబోఫ్లావిన్ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చర్మాన్ని హైడ్రేటెడ్​గా ఉంచడమే కాకుండా వ్యర్థాలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మచ్చలు, ముడతలు తక్కువగా కనిపించేలా చేస్తుందంటున్నారు.

పాలకూర : దీనిలో ఖనిజాలు, విటమిన్లు ఎక్కువ. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చర్మాన్ని మెరిపిస్తాయంటున్నారు నిపుణులు. వీటితో పాటు బాదంపప్పు, చేపలు, డార్క్‌ చాక్లెట్‌, ఆల్చిప్పలు వంటి ఆహారపదార్థాలు కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు గ్లోయింగ్ స్కిన్ పొందడంలో చాలా బాగా సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ ఫేస్​ ప్యాక్​ను ఎప్పుడైనా ట్రై చేశారా? - ముఖంపై మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం!

ABOUT THE AUTHOR

...view details