Best Drinks To Control Blood Sugar Levels :షుగర్ లెవల్స్ పెరగడం వల్ల ఇబ్బంది పడేవారికి కాకరకాయ జ్యూస్ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో షుగర్‌ను అదుపు చేసే కొన్ని గుణాలున్నాయట. కాకరలోని పాలీపెప్టైడ్ సమ్మేళనం.. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా చేస్తుందిని అంటున్నారు. అందుకే.. మధుమేహంతో బాధపడేవారు కాకరకాయ రసాన్ని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
అర్ధరాత్రి మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టడం లేదా ? - ఆ టైమ్‌లో ఇలా చేస్తే డీప్ స్లీప్ గ్యారంటీ!
ఉసిరి :ఉసిరి కాయలో ఉండే ఎన్నో రకాల ఔషధ గుణాలు షుగర్ వ్యాధితో బాధపడేవారికి మేలు చేస్తాయి. మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా ఉసిరి రసం తీసుకోవడం వల్ల షుగర్‌ను అదుపులో ఉండేలా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉసిరి రసం చేయడానికి.. 2 లేదా 3 ఉసిరి కాయల్ని కట్ చేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో గ్లాసు నీళ్లను పోసుకుని మళ్లీ గ్రైండ్ చేసుకోండి. ఈ ఉసిరి రసాన్ని డైలీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులంటున్నారు.
స్మోకింగ్ వల్ల మెమొరీ లాస్ పక్కా! పరిశోధనలో కీలక విషయాలు!!
దాల్చిన చెక్క :మధుమేహంతో బాధపడేవారికి రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండటానికి.. దాల్చిన చెక్క నీరు బాగా ఉపయోగపడుతుంది. ఈ హెర్బల్ డ్రింక్‌ని ఎలా తయారు చేయాలంటే.. ముందుగా ఒక కప్పు వేడి నీళ్లలో మూడు లేదా నాలుగు చిన్న దాల్చిన చెక్కల్ని వేసి మూత పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ నీటిని డైలీ భోజనం చేసిన తర్వాత తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మెంతుల వాటర్ :రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ మెంతులను నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఈ చిట్కా మధుమేహం ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2014లో "Phytotherapy research" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు 8 వారాల పాటు రోజుకు రెండుసార్లు 10 గ్రాముల మెంతుల గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల.. రక్తంలో చక్కెర స్థాయులు, హెమోగ్లోబిన్ A1c స్థాయిలు (దీర్ఘకాలిక రక్తంలో చక్కెర నియంత్రణను కొలిచే కొలమానం) గణనీయంగా తగ్గాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని "ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్"కు చెందిన 'డాక్టర్ మోహమ్మద్ అలీ షాహి' పాల్గొన్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
జలుబు, దగ్గు నుంచి డయాబెటిస్, గుండె సమస్యల నివారణ వరకు - దివ్యౌషధంలా తమలపాకు!
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, అజీర్తి సమస్యలు వస్తాయా? - నిపుణులు ఏమంటున్నారంటే?