తెలంగాణ

telangana

ETV Bharat / health

మీ వయసు 40 దాటిందా? - ఆహారంలో మార్పులు కంపల్సరీ - ఇవి కచ్చితంగా తినాల్సిందే! - Best Diet for after 40 Years

After 40 Years Must Eat These Foods : వయసు పెరిగే కొద్దీ వివిధ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం సహజం. వాటి నుంచి తప్పించుకోవాలంటే.. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 9:33 AM IST

Must Eat These Foods After 40 Years
After 40 Years Must Eat These Foods (ETV Bharat)

Must Eat These Foods After 40 Years : ఎవరిలోనైనా వయసు పెరిగే కొద్దీ శరీరంగా బలహీనంగా మారి వివిధ ఆరోగ్య సమస్యలు ఎటాక్ చేస్తుంటాయి. అలాకాకుండా ఉండాలంటే.. ఒక వయసు తర్వాత తీసుకునే ఆహారం మీద శరీరానికి అందుతున్న పోషకాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి 40 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మహిళలు కొన్ని రకాల ఆహార పదార్థాలు(Foods)తప్పనిసరిగా డైలీ డైట్​లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆకుకూరలు :ఇవి హెల్తీగా ఉండడానికి ఎప్పుడైనా మంచి ఆప్షన్. 40 ఏళ్ల తర్వాత అయితే ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వీటి నుంచి ఐరన్, విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్స్ వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇవి హిమోగ్లోబిన్, RBC, WBC కౌంట్‌ని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి. వీటిని కూరలు, చట్నీల రూపంలో తీసుకోవచ్చంటున్నారు నిపుణులు.

పప్పులు : 40 ఏళ్లు దాటాక మీ డైట్​లో తప్పక ఉండాల్సిన మరో ఆహార పదార్థం.. పప్పులు. పెసరపప్పు, మినప, శనగ పప్పులో అనేక పోషకాలు దాగి ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. రోజూ వీటితో కూడిన వంటకాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయంటున్నారు. ఫలితంగా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు.

గుడ్లు : మీరు 40 ఏళ్ల తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే మీ డైట్​లో ఉడికించిన గుడ్డు ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. దీనిలో ప్రొటీన్ కంటెంట్, విటమిన్ డి, బయోటిన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఉడికించిన గుడ్లు తినడం వల్ల కండరాలు శక్తిని కోల్పోకుండా బాడీ బలంగా తయారవుతుందంటున్నారు నిపుణులు.

అమ్మలూ ఇవి తినండి - మీరు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది! - Healthy Nuts For Women

యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలు :40 సంవత్సరాల తర్వాత కూడా ఆరోగ్యంగా, చురుగ్గా ఉండే శరీరం కావాలంటే తప్పనిసరిగా యాంటీఆక్సిడెంట్ల అవసరం ఉంటుందంటున్నారు నిపుణులు. దీనికోసం యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు. డార్క్ చాక్లెట్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు వంటి కొన్ని రకాల ఆహార పదార్థాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి క్యాన్సర్​కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకోవడంలో కీలకంగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తీసుకోవాలంటున్నారు.

2000లో 'ఎక్స్‌ప్లోరేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజ్'(EPIC) పేరుతో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. 40 ఏళ్ల తర్వాత యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఆహారాలు తినే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని కనుగొంది. ఈ పరిశోధనలో యూకేలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ టిమ్ డైయాక్స్ పాల్గొన్నారు. 40 సంవత్సరాల తర్వాత యాంటీఆక్సిడెంట్లు ఉండే ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

పాల ఉత్పత్తులు : జీర్ణక్రియ మెరుగ్గా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం. పెరుగు, మజ్జిగ వంటి పాల సంబంధిత ఆహార పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే వీటిలో కాల్షియంతో పాటు ప్రో-బయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు అవసరమైన సంఖ్యలో బ్యాక్టీరియాను అందించి జీర్ణక్రియ తేలిక చేస్తాయంటున్నారు నిపుణులు. ఇలా ప్రతిఒక్కరూ 40 ఏళ్ల తర్వాత కూడా ఈ డైట్ మెయింటెన్ చేస్తే సంతోషంగా జీవించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మొలకలు తింటున్నారా? - మరి, ఈ ప్రమాదాల గురించి తెలుసా? - Sprouts Side Effects

ABOUT THE AUTHOR

...view details